పుట:Andhraveerulupar025958mbp.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొంగలు సకాలమునకు జంద్రవంకనదీతీరమున జేరి భోజనాదు లొనరించి దొంగతనమునకు సమయ మరయుచుండిరి. బురుజు పై నెక్కి బ్రహ్మనాయకుడుగాంచ బలువురు నూతనులుకనిపించుటచే ననుమానించి అభిమాన పుత్త్రరత్నమగు కన్నమనాయని పిలిచి దొంగలేయైనచో దగినబుద్ధిచెప్పి రమ్మని పంపెను. కన్నమనాయడు పరివార సహితుడై చంద్రవంక నదీతీరమున నున్న కంచె చెంతనిలచి యాలింపగా బ్రసంగముల వలన వచ్చినవారు దొంగలనియు నాయకురాలిచే బంపబడి మాచర్లదోచుటకు వచ్చిరనియు దెలియవచ్చెను. వెంటనే కన్నమనాయడు పరివారముతో ముందునకు దుమికి ఏప్రయత్నములు లేక యిష్టగోష్ఠిసలుపుచున్న దొంగలనందఱ బంధించి వారియొద్ద గల యాయుధము లన్నింటిని రాచనగరునకు బంపి గోనెల దెప్పించి వానినిండ నిసుకనించి దొంగల నెత్తిపై బెట్టించి గురుజాలకు నడిపించి అందఱ నొక దొడ్డిలోనికిందోలి తాను ద్వారము గాచియుండెను. కన్నమనాయడు ------ బంపబడిన చోరులను బరాభవించినందులకు నాయకురాలు కోపించి తూలనాడెను. కన్నమనాయడు నాయకు రాలు యొక్క దురంతము గురిజాల వాసులందఱకు దేటతెల్ల మగునట్లు నాయకురాలి నిందావచనము లన్నింటికి బ్రత్యుత్తరము నొసంగి గృహాభిముఖుడయ్యెను. ఎంతకును కన్నమనాయకుడు రాకపోవుటచే బ్రహ్మనాయకుడు తెల్లవారి విచా