పుట:Andhraveerulupar025958mbp.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ణించిరి. అఱువదియొక్కరు గాయపడిరి. మహారాజును స్వాతంత్ర్యప్రియుడును ధర్మమూర్తియు నగు విజయరామరాజు మరణము విని దేశమంతయు నొక్కమాఱు పరితపించెను.

ఆంగ్లసైనికులు విజయరామరాజు దేహముపై నున్న అమూల్యరత్నాభరణములు, దుస్తులు లాగికొనిరి. బొబ్బిలి సంగ్రామములో దాండ్ర పాపారాయునిచే బెద్ద విజయరామరాజుగారు చంపబడిన పిదప ముప్పది తొమ్మిది సంవత్సరముల కీసంగరము జరిగెను. ఈ విజయరామరాజు గతింపగనే ఆంగ్లేయులు రాజ్యము నాక్రమించుకొనిరి. ఈ ఘోరసంగరవార్తవిని రాజ్యమున నున్న దనకేమి యపాయము వాటిల్లు నోయని విజయరామరాజుభార్య నారయణ బాబను నామముగల ఎనిమిది సంవత్సరముల బాలుని దీసికొని మన్నెములకు బోయెను. ఆంగ్లేయులు ఆబాలుని దల్లిని రప్పించి సంవత్సరమున కింతయని పన్ను గట్టునటుల నేర్పాటుగావించి రాజ్యము నాబాలున కప్పగించిరి.

విజయనగర రాజ్య విస్తృతియు నైశ్వర్యము స్వాతంత్ర్యాభిలాషయు విజయరామరాజు మరణముతో దగ్గిపోయెను. తరువాత నాకుటుంబమున స్వతంత్ర శీలుడగు రాజవతంసుడు జనించుట కవకాశములు లేక పోయెను. అతి విస్తృతమై యాంధ్రదేశమున కంతటికి నాయకరత్నము కాదగిన విజయనగర రాజ్యము క్రమముగా గొంతకొంత