పుట:Andhraveerulupar025958mbp.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శూలగంధమై మారుతము వీచెను. భూతవ్రాతము సోమభూపాలుని దీక్షకు దానధర్మములకు మిగుల నానందించి స్వస్తి వాచకములు గావించుచుండెను. ఇంత యనరానివైభవమున వ్రతము ముగిసెను. అనంతరము సమాగతులగు సందఱ నర్హత ననుసరించి సత్కరించి వారి వారిదేశములకు బంపెను. దైవానుగ్రహమున సిరియాల దేవికి నెలమసలెను. పౌరు లాశుభవర్తమానము గ్రహించి రాజ్యమున నెడతెగకుండ నుత్సవములు గావించిరి. సోమరాజు మితిలేని సంతనమున ననేక ధర్మకార్యముల గావించెను. రాజ్యమునందంతటను శభచిహ్నములు నిబిడీకృతములై విరజిల్లెను. శుభప్రదర్శనములచే రాజన్యుడు, పౌరులు పరాజయచింత దిగనాడి భావ్యభ్యుదయ సూచకమగు రాజకుమార జననమునకై యెదురుచూచుచుండిరి. శుభోదయమునకై యెదురుచూచుచుండుటచే రాజన్యుడు, పౌరులు నమత్యాదులు కటకేశ్వరుని వలన రానున్న విపత్తులను లక్ష్యము జేయజాలరైరి. సమయము నెఱింగి వేగువాలండ్రు కందారమునకు భిక్షుకవేషముతో బ్రవేశించి రాజ్యరహస్యములు గ్రహించి కటకమున కేగి సైనికుల విశ్రాంతియు రాజ్యమునగల శుభోదంతము కందారనాయకుని నిర్భీతవర్తనము తమ యేలికకు నివేదించి మఃట్టడికిది మంచిసమయమని ప్రోత్సహించిరి. సంగ్రామ మూహూర్తమునకై యెదురుచూచుచున్న కటకేశ్వరుడు మిగుల నానందించి సైన్యములనన్నింటి