పుట:Andhraveerulupar025958mbp.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సైన్యము పలుచబారెను. దేవుడుసైతము ప్రతికూలుడై యపజయఫలము చవిచూప నిశ్చయించెను. మఱల సోమరాజు పరాజయము నొందెను.

జలాశయమున మకరీంద్రుని బల మతిశయించి నటుల స్థానమహత్త్వముచే కటకేశ్వరుని బలము దినదినాభివృద్ధి యగుచుండెను. సోమరాజు పరాజయముతో గృహముజేరి, సంగ్రామముపై జీవితము నాధారపఱచుకొనుట లాభదాయకము గాదని యనుభవముచే గ్రహించి తన రాజ్యమునందలి ధర్మపురి, మంత్రకూటము, కాళేశ్వరము, లోనగు గ్రామములలోనున్న సర్వశాస్త్రజ్ఞులగు బ్రాహ్మణోత్తముల రావించి వారల నందఱ నుచితవిధి గౌరవించి కటకేశ్వరుడు గావించిన గోధనాపరణమును సవినయముగ విన్నవించి గోధనమును మఱల గొనివచ్చి విరోధిని బంధింపగల సత్పుత్త్రు డేపుణ్య కర్మములు గావించిన జనించునో యానతిండని వేడుకొనెను. బ్రాహ్మణులు పెద్దయుంబ్రొద్దుయోజించి శాస్త్రముల బరిశీలించి తొల్లి దశరధమహారాజు గావించిన పుత్రకామేష్ఠివంటి వ్రతరాజము వేఱులేదని విన్నవించిరి. రాజు మిగుల నానందించి వలయు వస్తుసంభారమునంతయు సంగ్రహించి రాజబంధువులను సామంతులను సర్వజ్ఞులగు బ్రాహ్మణోత్తములను రావించి వ్రతదీక్ష వహించి తన ధర్మపత్నితో యాగవేదిక నలంకరించెను. అగ్నిహోత్రుడు సుముఖుడై ప్రజ్వలించెను. ఆ