పుట:Andhraveerulupar025958mbp.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహమ్మదీయసైన్యము పలుచబడుటచే వారేమి చేయజాలక యెట్లు ముందుజరుపనగునో నిశ్చయించుటకు రాత్రివేళ నేకాంతసభ యొకటి యొనరించి సోమనాద్రితో సంధి జరుపుటయే నిరపాయమగు మార్గమని నిర్ణయించుకొనిరి.

నిజాము ఆలీ సోమనాద్రిని సయ్యదుమియ్యాను ఒకచోజేర్చి యిరువురకు సమాధానవాక్యములజెప్పి యైకమత్యము గలుగజేసి గతముమఱచిపొండని కోరెను. సోమనాద్రి సంధి కంగీకరించి తనవిజయమునకు సూచనగా నొకగొప్ప ఫిరంగిని బహుమతిగా గైకొని తననగరము జేరెను. సోమనాద్రి విజయలక్ష్మీద్వితీయుడై తనపట్టణముజేరి తనకు సహాయముగావచ్చి సంగరమున బ్రశంసాపాత్రముగా బనిచేసిన వీరులందఱకు ఆభరణములు, మాన్యములు,ఆయుధములు బహూకృతిగా నొసంగి తన విశ్వాసమును బ్రకటించెను. బ్రతికినంతకాలము సోమనాద్రి పరాజయము నెఱుంగక శత్రుసైన్యములదాకి విజయమునందుచు నమితవిఖ్యాతి గడించెను.

సోమనాద్రి భూపాలుడు తిరుపతియాత్రకు బయలుదేరి గనికోట, నంద్యాల పాలకులను జయించి ప్రతిసంవత్సరమును సుంకమును గట్టునటుల గట్టడి చేసెను. తిరుపతిక్షేత్రము జేరి సోమనాద్రి వేంకటేశ్వరస్వామిని దర్శించి విరాగియై యచటనే దేహయాత్ర చాలించెను.

సోమానాద్రినే సోమనాథభూపాలుడని కూడ వ్యవహరించుట గలదు. ఈ మహావీరుడు పెక్కుగ్రంథముల నంకిత