పుట:Andhraveerulupar025958mbp.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దించి యాతనికి గోరినతావుల నెన్నియో క్షేత్రరాజములొసంగి గౌరవించెను. తెల్లగ తెల్లవార గనే సోమనాద్రి తన స్కంధావారమునందు విజయభేరి మ్రోగించెను. ఆనాదమునాలింప యవనుల గుండె లదరెను. విధిలేక తమప్రభువుని యానతి దాటజాలక వారును సంగరసన్నద్ధులైరి.

సొమనాద్రి పరివారసహితముగ సంగర మొనరించి శత్రుసమూహమును నేలమట్టము గావించెను. ఇంతలో దనతండ్రినిజంపిన దావతుఖాను డెదురయ్యెను. సోమనాద్రి వాని బలమునంతయు దృటిలో దునుమాడి కంఠము ఖండింపబోయెను. ఆతడు సోమనాద్రిపాదములపై బడి శరణుగోరెను. తనతండ్రి నన్యాయముగా జంపి యావదాస్తిని హరించిన నాటికోపము మనసులోనుంచుకొని వాడెంతప్రార్థించినను విడువక తల ఖండించెను. శత్రుసైన్యము సోమనాద్రిధాటి కాగజాలక కర్నూలుకోటలో దాగికొనెను. సముచితసైనికబలముతో సోమనాద్రి కర్నూలుకోట భేధించి యవనుల నెందఱనో సంహరించి వెనుకకు మఱలెను. పేరుజెందిన మహమ్మదీయ సేనానులందఱు మరణించిరి. ప్రాగుటూరు, బళ్ళారి, ఆదోని, కర్నూలు నవాబులు గతించిరి. గుత్తి, రాయచూరు నవాబులు, వివాదకారణభూతు డగు సయ్యదమియ్యా ప్రాణములతో మిగిలిరి. సోమనాద్రి యకుంఠిత దీక్షతో సంగరప్రయత్నములు విరామము లేక చేయుచుండెను.