పుట:Andhraveerulupar025903mbp.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. గౌతమీపుత్ర శాతకర్ణుడు.

ఆంధ్రదేశము నందలి పురాతననగరములలో ధాన్యకటకము తొలుత యెన్నదగినది. బెజవాడకు మూడామడల దూరమున బశ్చిమదిశను గృష్ణాతీరమున అమరావతి చెంత నీజీర్ణనగరము గలదు. దీనినే మనమిపుడు ధరణికోట యని వ్యవహరించుచున్నారము. మిగుల నున్నతములగు మంటిదిబ్బలతో మనోహరములగు బౌద్ధస్థూపములతో నొప్పి పూర్వశోభల గోలుపోయిన యీప్రదేశము నొకమారు సందర్శించి మన పూర్వచరిత్రము స్మరింతుమేని ఆంధ్రరాజుల రాజధాని నగరమునకా యీదుర్దశ యని పరితాపము కలుగకమానదు.

ధరణికోట రాజధానిగ జేసికొని పాలించిన శాతవాహన వంశజులగు నాంధ్రరాజులలో గౌతమీపుత్ర శాతకర్ణి ప్రథమగణ్యుడు. విజ్ఞానమునందును బరాక్రమమందును బరిపాలనాచాకచక్యమునందును నీత డసమానుడు. ఇతడు పలుమాఱు విజయయాత్రల కేగి యవనులను, శకులను, పహ్లవులను లోబఱచికొని ధాన్యకటక సింహాసనాశీనుడైన వెంటనే తన పెద్దకుమారుడగు వులమాయిని యువరాజపట్టాభిషిక్తుని గావించి ప్రతిష్ఠానపురమునం దాతని నుంచి తనపూర్వులు కోలుపోయిన రాజ్యములన్నింటిని గడించెను. ఈనృపాలుని వంశమును శాతవాహనవంశ మని యందురు. శాతవాహన నామము ఎటుల వచ్చినదో తెలుపు చిత్రకథయొకటి వాడుక