పుట:Andhraveerulupar025903mbp.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పర్వతరాజుమరణము విని యతని కుమారుడగు మలయ కేతువు విచారపడుచుండ బ్రతిపక్షుల సేనానయకుడగు భాగురాయణుడు వచ్చి చెలిమి సంపాదించుకొని 'మలయ కేతూ! చాణక్యుడు నీతండ్రిని జంపించినటులె నిన్నును జంపింప నున్నాడు. బ్రదుక దలచిన నిటనుండి వెడలిపోవుట మంచి'దని తెల్పెను. అతని మోసపుమాటలు నమ్మి మలయ కేతువు భాగురాయణుని మంత్రిగ జేసికొని తన పర్వత రాజ్యమునకు వెడలిపోయెను.

పర్వతరాజ కాలమరణ మొందుటయు మలయకేతువు పాఱిపోవుటయు జూచి యిదియె యదనని చాణక్య చంద్రగుప్తులు మంగళవాద్యములతో బాటలీపుత్రమున బ్రవేశించిరి. రాక్షసుడు సైన్యముల బ్రోత్సాహపఱచి చాణక్య చంద్రగుప్తుల బలము మీదికి దన బలమును నడపెను. ఉభయ బలములకు భయంకరమగు సంగరము జరిగెను. రాక్షసుడు ఈ యదును గనిపెట్టి నందులపక్షమున జేరి, చంద్రగుప్తునకు బట్టాభిషేకము చేయరాదని చాటించెను. అంతతో బోక మహానందుని ఒక సురంగ మార్గమున దపము జేసికొనుటకు బంపి యతని స్వీకారపుత్రుని రాజ్యమునందు బ్రతిష్ఠింపవలయునని రాక్షసుడు నిశ్చయించెను. చంద్రగుప్త చాణక్యులు పాటలీపుత్రమున బరిచయము సంపాదించుకొనిన కొలది తన కపకారము కలుగక తప్పదని రాక్షసుడు గర్భవతి యగు తన