పుట:Andhra bhasha charitramu part 1.pdf/857

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాలగోడు, ఆశాపాశా, ఆస్తీపాస్తీ, ఇంటావంటా, ఇంతో అంతో, ఇల్లూ వాకిలీ, ఉచ్చంనీచం, ఉత్తరంపత్తరం, ఊప్పూకారం, ఊరూవాడా, ఊరూ పేరూ, (లేనవాడు), ఊళ్లూపూళ్లూ (ఏకమయినవి), ఎక్కువా తక్కువా, ఎగుడూ దిగుడూ, ఎచ్చూ తగ్గూ, ఏళ్లూపూళూ (పట్టును), ఒచ్చెం పొచ్చెం, కంచంముంతా, కత్తులూకటార్లూ, కన్నూ కాలూ, కబురూ కాకరకాయ, కబురూగట్రా, కర్రాకంపా (గట్రా), కసవూగట్రా, కాయాకసురూ, కారాకూరం, కారాలు మిరియాలూ, కాలూచేయీ, కుండాచట్టీ, కుండా మండా, కూరాకాయా, కూరానారా, కూలీనాలీ, కొంపాగుడిశా, కాలూకదపా.(అన్యదే), గట్టూపుట్టా, గడ్డీగట్రా, గడ్డీగాదరా, గుట్టూమట్టూ, గుండాపిండీ, గుడ్డాగుడుసూ, గుడ్డూగూసూ, గొడ్డూగోదా, చ(స)డీచప్పుడూ, చదువూసంధ్యా, చిందఱవందఱ, చిదుగూచిట్రా, చిన్నాపెద్దా, చిలుకూమలుకూ, చిల్లరాచిట్రా, చిల్లరాచిదిపీ (చిదిపీచిల్ల రా), చిల్ల రామల్లరా, చీమలూగామలూ (కలగొనిచీమల గామలవలెను, జెలగుచుముందఱ శిశువు లాడంగ. హరిశ్చ. II.); చీరాచిట్రా, చుట్టంపక్కం, వెట్టూచేనూ, చెట్టూచేమా, చెత్తాచెదారం, చెరుపూమరుపూ, చేనూచెట్రా, జంకూగొంకూ, జీతంనాతం, డబ్బూదసకం, డొక్కూడోలూ, తల్లీపిల్లా, తాఱుమాఱు, తిట్టాదిన్నే, తిండీతీర్థం, తొక్కాతోలూ, తోలూతొపారం, నగానట్రా, నీళ్లూనిప్పులూ, నుయ్యీగొయ్యీ, నోరూవాయీ, పనీపాటూ, పసుపూ కుంకం, పాడీపంటా, పాపంపుణ్యం, పిన్నాపెద్దా, పియ్యీపేడా, పిల్లాజెల్లా, పిల్లాపేకా, పిల్లామేకా, పిసరూపిప్పీ, పురుగూపుట్రా, పెట్టేపేడా, పెదాపిన్నా, పెళ్లీపెడాకులూ, పే(బీ)దాసాదా, పేరూప్రతిష్ఠా, పోలూపొందూ, బుగ్గీబూడిదా, భూమీబుట్రా, మడీమట్రా, మందూమాకూ, మన్నూమశాణం, మన్నూమిన్నూ, మాలామాదిగా, మాటామంతీ, మాయామర్మం, మిట్టాపల్లం, ముక్కాముట్రా, ముడ్డీమొగం(తెలియనివాడు), ముద్దూ ముచ్చటా, మూటాముల్లే, మూతముప్పిడి, మేడామిద్దే, రండీమొండీ, రవ్వారట్టూ (రట్టూ రవ్వా), రాకాపోకా, రాయీరాపాషాణం, రాయీరప్పా (ప్రాకృతము: రప్ప = వల్మీకము; గుజరాతీ = రాఫడో); లంచంపంచం, లొడ్డూలొసుకూ, వెఱ్ఱీమొఱ్ఱీ, వేరూవెల్లంకీ - మొదలయినవి.

పై జంటలయం దేకార్థీభావము కలిగియుండుటచే వానిని ద్వంద్వసమాసము లనియే యనవలెను. వానిలో గొన్నిటియందు సముచ్చయార్థక దీర్ఘములును తుది ము వర్ణకములును, బహువచన లు వర్ణమును లోపించి కేవల ద్వంద్వసమాసములు కావచ్చును. అప్పుడు కొంచె మర్థభేదము కలుగును.