పుట:Andhra bhasha charitramu part 1.pdf/849

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కడుగు; ౙలతారు = జలకము + తారు, ౙలపోత = ౙలకము + పోత; ౙౙలపోసనము = ౙలకము + పోసనము; నిక్కాక = నిండు + కాక; నిముకళా = నిమురు + కళ్లము; ముంగమురము = ముందు + కయి + మురము; ముంగయిమురము = ముందు + కయిమురము; మువ్వ = మూడు + వా; తెఱవ = తెఱ + వా; మోచేయి = మోద + చేయి; పదులుడి = పదులు + లూటి; వాకిలి = వా + ఇల్లు; వెన్న = వెల్ల + నేయి మొదలయినవి.

ద్విరుక్తప్రకరణము.

తెనుగున సంధినిగూర్చి వ్రాయునప్పు డామ్రేడితనంధినిగూర్చి కూడ విచారించియుంటిమి. మొదట నుచ్చరించిన పదమునే వ్యవథానము లేకుండ నుచ్చరించునప్పు డారెండవనారి యుచ్చరింపబడిన పదము కామ్రేడితమని పేరు. ఈ యామ్రేడిత మనేకార్థములందు కలుగుచుండును. ఇంగ్లీషుభాష యందీ యామ్రేడితమున కంతగా వ్యాప్తిలేదు. సంస్కృతమున గొన్ని సందర్భములం దామ్రేడితము గలుగుచుండును. భారతీయాధునిక భాషలయందు మాత్రమిది యెక్కువగ బ్రయోగింపబడుచున్నది. అందును వ్యవహారమున నిది యపరిహార్యముగా నున్నది.

ద్విరుక్తి నాలుగు విధములుగా నుండును: (1) పూర్వోక్తమైన మాటయే ప్రత్యయాదులతోగూడ మరల పలుకబడుట: ఉదా. గణగణ, తినితిని, అనగా అనగా, మొద. (2) పూర్వోక్తమయిన మాట ప్రత్యయాదులయందలి మార్పులతో మరల పలుకబడుట: ఉదా. మాటిమాటికి, వాడినట్లున్నాడు, అంటే నేనిట్లు చెప్పినాను, చెప్పి అంతటితో ఊరుకోలేదు మొద. (3) మొదట పలికిన మాటయే కాకున్నను, తెనుగుననైనను నితర భాషలయందయినను నదే యర్థముగల మాటను పలుకుట: ఉదా. కుండామండా; బోర్డుబల్ల; గేటువాకిలి; పేరూ, ప్రతిష్టా మొద. (4) ప్రత్యయాదులలో మార్పు కలిగియు, కలుగకుండకయు, కేవల స్వరభేదము గలిగి యదేమాట మరల పలుకబడుట: ఉదా. నూనూగుమీసాలు, చిట్టి చిట్టి పలుకులు, వేడి వేడి యిడ్డెనలు మొద.

ద్విరుక్తియందు గలుగు నర్థభేదములను వర్గీకరింప సాధ్యముకాదు. సిద్ధాంతకౌముదియందు వివరింపబడిన యర్థములందే కాక, తెనుగున నింకను ననేకార్థములందు ద్విరుక్తికి ప్రయోజనము గలదు. ఈ క్రింద గొన్ని ప్రయోగములనుమాత్ర మిచ్చుచున్నాను. వాని యర్థభేదములను పాఠకులు సులభముగ గ్రహింపగలరు. వానిలో గొన్ని యర్థములు సంస్కృత వ్యాకరణములందు వివరింపబడినవే.