పుట:Andhra bhasha charitramu part 1.pdf/850

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(1) వండుతున్నాడు, వండుతున్నాడు, ఎంతటికిన్ని అన్నం ఉడుకదు.

(2) తిని, తిని బలిసినాడు; ఆడి, ఆడి అలసిపోయినాడు.

(3)చదువుతూ, చదువుతూ ఉన్నాడు.

(4) ఉండుండి ఒక చినుకు పడుతున్నది.

(5) చెట్టు చెట్టుకూ నీళ్లు పోసినాడు. ఇంటింటికిన్ని ఫొయినాడు.

(6) అనగా, అనగా, ఒకరాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు; ఏడుగురు కొడుకులున్ను ఏట్లో పడినారు. పడి, ఏడుచేపలు తెచ్చినారు. తెచ్చి ఏటి ఒడ్డున ఎండవేసినారు.

(7) అందులో ఒకచేప ఎండిందికాదు. "చేపా, చేపా ఎందు కెండినావు కావే?" - "గడ్డి దుబ్బ చాటు." - "గడ్డిదుబ్బూ గడ్డిదుబ్బూ, ఎందుకు చటే?" - "గుర్రం మేసింది కాదు." - "గుర్రం, గుర్రం, ఎందుకు మేసినావు కావే?" - "పోలిగాడు కాసినాడు కాడు." - "పోలిగా, పోలిగా, ఎందుకు కాసినావు కావురా?" - "పోలి అంబలి పెట్టలేదు." - "పోలీ, పోలీ, ఎందుకు అంబలి పెట్టలేదే?" - "చీమ కుట్టింది." - "చీమా, చీమా, ఎందుకు కుట్టినావే?" - నీ పెళ్లినాడు పప్పూ, కూడూ, పెట్టినావా, పెట్టినావా, పెట్టినావా?"

(8) ఆ దేశములో ఊరూరూ ఎంతో అందముగా ఉన్నది. ఇంటింటా ఒక పొయ్యి, మాయింట మరొక్కపొయ్యి.

(9) ఆ ఊరికి మీదు మీదుగా (దగ్గర దగ్గరగా, కిందు కిందుగా) పోయినాడు.

(10) సారంగధరా, సారంగధరా, ఇట్లు తప్పించుకొంటావా?

(11) దేవా, దేవా, నీవే నాకు దిక్కు.

(12) మూర్ఖా, మూర్ఖా, నాచేత చిక్కినావు; ఇంకెక్కడకు పోతావు?

(13) శూరుడా, శూరుడా, ఏదీ నీ శౌర్య మెక్కడకు పోయినది?

(14) దొంగా, దొంగా, చూడు నిన్నేమిచేస్తానో!

(15) ఒకొక్కమాటా వెయ్యి వరహాలు చేస్తుంది, ఒకొక్కమాటు కలలు నిజమవుతవి; ఒకొక్కరే జారిపోయినారు; ఒక్కరొక్కరు చల్లగా జారి పోయినారు; ఒకానొకప్పుడు; ఒకానొక ఊరిలో, ఒకొక్కప్పుడు; ఒకొక్క కొమ్మకు కోటి రాక్షసులున్నారు; వారిలో ఒకరికొకరికి పడదు; ఒకరికొకరికి అట్లా వికారం పుట్టుతుంది; ఒకొక్కరికి ఒక రూపాయి ఇయ్యి, ఒకరికొకరు సాయపడవలెను; ఆ సేనలో ఒకరొకరూ మహారథులే; ఒక్కటే ఒక్కటి.