పుట:Andhra bhasha charitramu part 1.pdf/838

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లు పృథగర్థముల కేకార్థీభావము కలుగునప్పుడు పదముల ప్రాతిపదిక రూపములే పూర్వపదములుగ నిలువవలయు నను నియమము కలుగ. కావుననే లుక్సమాసములేకాక యలుక్సమాసములును శాస్త్రసమ్మతములైనవి. తెనుగున సాధారణముగ నన్నియు 'బ్రథమా విభక్త్యింతపదము పూర్వమందుగల సమాసములే యుండునని చెప్పవచ్చును. డుజ్, ము, వు, లు, మాత్రమే ప్రథమావిభక్త్యంతము లనుకొనుట పొరపాటయినట్లు తోచుచున్నది. 'రాముడు' వనము, తరువు మొదలగునవెట్లు ప్రథమావిభక్తియందున్న వో, మాట, చీకటి, మ్రాను, సందె, గూడు, పాము, పరువు, మొదలగునవియు బ్రథమావిభక్తియందే యున్నవి. అవి స్త్రీసమములనుట శాస్త్రార్థముగాని వాస్తవికముకాదు; అవి ప్రాతిపదికములును బ్రథమారూపములునుగూడ నగును. తెనుగుపదములకు బ్రాతిపదికమనియు బ్రథమారూపమనియు భేదములేదు. పూర్వపదముల కొకవేళ సమాసమందు వికారము కలిగినచో నవి. యలుక్సమాసములుగనే నిలుచుచున్నవి. కావున నర్థమునుబట్టి యొక విభక్త్యర్థమున మఱియొక విభక్తిరూపము నుపయోంచినను తెనుగున విభక్తిరూపమున కెన్నడును లుక్కు కలుగదు. అందువలన దెనుగున సమాసములన్నియు నలుక్సమాసములేకాని లుక్సమాసములు లేవని చెప్పవచ్చును. కొన్నియెడల సమాసమందలి పూర్వపదము ప్రాతిపదిక రూపము దాల్చినను నది సంస్కృతసిద్ధసమాసమునకు వికృతియని చెప్పవచ్చును గాని, ప్రత్యేకాచ్ఛికపదముల కూడికవలన నయినదని చెప్పగూడ దనవ వచ్చును.

తెనుగున నర్థప్రాథాన్యమును వహించిన సమాస విథానమువలన దీర్ఘ సమాసములకు తావేర్పడినది. కొన్ని యుదాహరణములు మాత్రము చాలును:

      "ఘనదురితానుబంధ కలికాలజ దోషతుషార సంహతిం
       దనయుదయప్రభావమున దవ్వుగజోపి, జగజ్జనానురం
       జనమగు రాజ్య సంతత వసంత నితాంత విభూతి నెంతయుం
       దనరుజళుక్యమన్మథుడు" - ఇదియంతయు నొక్క సమాసము.

      "హిమకరుదొట్టి పూరుభరతేశకురుప్రభు పాండుభూపతుల్
       గ్రమమున వంశకర్తలనగా మహినొప్పిన యస్మదీయ వం
       శమున బ్రసిద్ధులై విమలసద్గుణ శోభితులైన పాండవో
       త్తములచరిత్ర" - ఇదియంతయు నొక సమాసము.

      "ఇనుమును రాగియు దగరంబును వెండియుబసిడియుం బ్రభూతములై పే
       ర్చిన సిరిజేయనొప్పెడు, ఖనులు". - ఇదియంతయు నొక్కటే సమాసము.