పుట:Andhra bhasha charitramu part 1.pdf/749

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(2) ['స్వయం' అనుపదము క్తప్రత్యయాంత పదముతో సమసింపదు; అనగా దానిపై నుండు 'అమ్‌' ప్రత్యయమునకు లోపము కలుగదు. 'స్వయం' అనున దవ్యయముకావున దానికి ద్వితీయా విభక్తిక ప్రప్రసక్తిలేదు: ఉదా. స్వయంకృతము; స్వయంలబ్ధము మొదలయినవి.]

(3) ఖట్వా శబ్దము ద్వితీయారూపము క్తప్రత్యయాంతముతో నిందార్థమున సమసించును: ఉదా. ఖట్వారూడుడు, ఖట్వాప్లుతుడు (మంచమెక్కినవాడు, మంచము(పై) నెగురువాడు) అనగా తెలివితక్కువవాడు, తప్పుదారి ద్రొక్కినవాడు అని నిందార్థము. నిందార్థము లేనప్పుడు సమాసముకాదు. ఖట్వామారూడ: = మంచముపై పరుండి యున్నవాడు.

(4) ['సామి' (= సగము) అనునవ్యయము క్తాంతశబ్దముతో సమసించి తత్పురుష సమాసమగును: ఉదా. సామికృతము = సగము చేయబడినది. ఇట్టిసమాసమున ద్వితీయావిభక్తి ప్రసక్తిలేదు.]

(5) కాలవాచకపదములు అత్యంత సంయోగార్థకములు కానప్పుడు ద్వితీయాంతములై క్తాంతములతో వైకల్పికముగా సమసించును: ఉదా. ప్రతిపచ్చంద్రుడు మాసప్రమితుడు; మాసమును పరిచ్ఛేదింప నారంభించిన వాడని యర్థము.

(6) కాలవాచకపదము లత్యంతసంయోగార్థమున గూడ ద్వితీయాంతములయి క్తాంతములు కానిపదములతో గూడ వైకల్పికముగ సమసించును: ఉదా. ముహూర్తసుఖము = ముహూర్తము సుఖము.

ii. తృతీయా తత్పురుషము.

(1) తృతీయా విభక్త్యంతపదము దానిచే తెలుపబడు గుణవాచక పదముతో సమసించి తృతీయా తత్పురుష సమాసమగును: ఉదా. శంకులా ఖండము = శంకులచేత చేయబడిన ఖండము; ధాన్యార్థము = ధాన్యముచేత సంపాదింపబడిన ధనము. తృతీయాంతపదబోధకవస్తువు కరణము కానప్పుడు సమాసము కలుగదు: ఉదా. అక్ష్ణాకాణ: = కంటి(చేత) గ్రుడ్డివాడు. ఇచ్చట గ్రుడ్డితనమునకు కన్ను కరణముకాదు.

(2) తృతీయాంతపదము పూర్వ, సదృశ, సమ, ఊన, అర్థ, కలహ, నిపుణ, మిశ్ర, శ్లక్ష్ణ, అనుపదములతో సమసించి తృతీయా తత్పురుష సమాసమగును: ఉదా. మాసపూర్వుడు = మాసముచేత పూర్వుడు; మాతృసదృశుడు = తల్లితో పోలిక కలవాడు; పితృసముడు = తండ్రితో సమానుడు; మాషోనము, మాషవికలము (కార్షాపణము) = మినుపగింజ ఎత్తుచేత తక్కువయైన (కార్షాపణ మను నాణెము); వాక్కలహము = మాట