పుట:Andhra bhasha charitramu part 1.pdf/272

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అర్ధానుస్వారము

వైదిక సంస్కృత భాషలలో నచ్చుల కనునాసికత్వము గలుగుచుండెడిది. ఇట్టి యనునాసికాచ్చులను అ, ఇ, ఉ, అని వ్రాయుచుండెడివారు. కొన్ని సందర్భములందు దీర్ఘాచ్చులును ననునాసికత్వము నొందుచుండెను: మహాన్+అసి=మహా అసి; రశ్మీ+ఇవ=రశ్మీరివ; సూనూ:+యువన్=సూనూర్యువన్ మొద (చూ. విట్నీ: సంస్కృత - వ్యాకరణము. పేరా 70 మొ. పేరా 209 మొ.) ఇట్టి సందర్భములం నచ్చు లనునాసికములుగగ మాఱక, వాని తరువాత ననునాసికోచ్చారణము జనించుచుండెడిది. సంస్కృతమున వర్గీయాక్షరములకు ముందు 'ఙ, ఞ, ణ, న, మ' లను ననునాసికాక్షరములే యుండెడివి: య, ర, ల, వ, శ, ష, స, హ లకుముం దనుస్వార ముండెడిది. ప్రాకృతములందు హల్లులతో గూడిన యనునాసికధ్వను లనుస్వారములుగ మాఱుటచే గేవల మనుస్వార మందు నిలిచినది. శబ్దముల తుదినుండు మకారము లోపించి దానికి పూర్వమందుండు నచ్చున కనునాసికత్వము గలిగినది. గుజరాతీ, మరాఠీ భాషలలో తుది యచ్చులు కొన్ని, అనగా తుది మకారము లోపింపగా మిగిలిన ననుస్వారోచ్చారణమును గలిగియున్నవి: గుజరాతీ, కర్వూ (*కరి అవ్వఉం=కర్తవ్యకమ్); హూ (హఉ, హఉం=అహకం అహం); మరాఠీ: శే (సయం, శతమ్); మోతీ (మొత్తి అం, మౌక్తికమ్); మొద నేటికొన్ని యార్యభాషలలో నీ తుదియచ్చుల యనునాసికోచ్చారణము పోయినది.

ప్రాకృతములందు ద్విత్వహల్లులు, అల్పప్రాణము+మహాప్రాణము, లేక అనుస్వారము+అల్ప, మహాప్రాణములు మాత్రము సంయుక్తములగు చుండెడివి. సంయుక్తాక్షరములకు బూర్వ మందుండు నచ్చు సాధారణముగ హ్రస్వముగ నుండెడిది. రానురా నీసంయుక్తాక్షరములలో నొకహల్లు లో--పగా దానికి బూర్వమందుండు నచ్చుదీర్ఘమయి హల్లు అనుస్వారముతో గూఊదియున్నచో ననుస్వారోచ్చారణము నందుచువచ్చినది. నేటి యార్యభాషలయం దిట్లేయున్నది: పఞ్చ్=పాచ్; అఙ్క్=ఆక్; వథ్యా=వంఝా=బాఝే; భాండీ=హాఱీ; పఙ్క్=పాక్ మొద

ప్రాకృతములందు కొన్నియెడల మూలమునం దనునాసికముగా ని యనుస్వారముగాని లేకున్నను నచ్చుల కనుస్వారత్వము గలుగుచుండెను: హిందీ: సత్య=సాచ్; నిద్రా=నీద్; సర్ప=సాప్ మరాఠీ: అశ్రు=ఆసూ; మహిష=భైస్; ప్రాకృతము : వక్ర=వక్క=వంక; పక్షిన్=పక్ఖి=పంఖి మొద.