పుట:Andhra bhasha charitramu part 1.pdf/273

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పై విషయము లాంధ్రభాష కెంతవఱకు ననువర్తించునో విచారింప వలసి యున్నది.

1. తుది మకార మనుస్వారమగుట: భయము + పడి = భయంపడి; విజయము+చేయు=విజయంచేయు: వ్యవహారమున: ధనము=ధనం; భయము=భయం; ముఖము=ముఖం, మొఖం, ముహం, మొహం; పాము=పాఉ; వాము=వాఉ మొద తెనుగు వ్యవహారమున బ్రయత్నించిన దప్ప దుది ము-వర్ణము నిలువదు.

2. పదమధ్య మకార మనుస్వారమగుట కముఁజు=కౌఁజు, పముఁజు=పంజు; దుముకు=దూకు మొద, వ్యవహారమున: రాముఁడు=రావుడు; భీముఁడు=భీవుడు మొద

3. అనుస్వారయుక్త హల్లోపము, పూర్వాచ్చునకు దీర్ఘము:- అంక్క=ఆక(చూ అంకిలి); అహంకార, హంక్కార=*అంక్కార=ఆకరము; అణగు=అణ్గు=* అంగు=ఆగు; అణచు=అణ్చు=* అంచ్చు=ఆచు; అంట్టు=ఆటు; తనుకు=తన్కు=*తంక్కు=తాకు; దనుక=దన్క=*దంక=దాక; తంట్ట;=తాట, తివుట=తిన్‌ట=*తింట్ట=తీట; తుంట్టికూర=తూటికూర, తుండ్డు=తూడు; తెంగ్గు-తేగు; తెండ్డు=తేడు; తొంగ్గు=తోగు;పిణ్డ=పెండ=పేడ; పెంట=పేట; పెండు=*పేడు; లంఘు=లంగ్గు=లాగు; లెంక్క=లేక, కుంక్కటి=కూకటి; పించము=పీచము, పుంట్ట=పూట; పొంజ్జు=పోజ; బొంక్కి=బోకి; మంగ్గు=మాగు; మింగడ=మీగడ; తలయంప్పి=తలాపి; లొంగ్గు=లోగు; పంక్క=పాకు(డు); గొంజ్జు=గోజు; ఉంక్కు=ఊకు; గండ్డి=గాడి; గండ్డు=గాడు మొద.

4. సహజముగ ననుస్వారము గలిగిన కొన్ని తెనుగు శబ్దములు:- నగ్న=నగ్గ=నంగ; దుక్క=దుంగ; బుగ్గ=బుంగ, ఉగ్గు=ఉంగు; కగ్గు=కంగు; కుగ్గు=కుంగు; మగ్గు=మంగు=మాగు, ఇగ్గు=*ఇంగు=ఈగు; పిక్కు=పింగు; అజ్జ=అంజ; అట్ట=అంట; అట్టు=అంటు; నట్టు=నంటు; ఇక్షు=ఇచ్చు=*ఇచ్చు=ఇంచు; ఉబ్బ=ఉంబ=ఉమ్మ; ఇచ్చు=ఇంచు; పగలిటి=పగలింటి మొద.

పై యుదాహరణములవలన ననుస్వారవిషయమున నాంధ్రభాష ప్రాకృతమార్గమునే యనుసరించుచున్నదని తెలిసికొనవచ్చును.

తెలుగున ననుస్వారము సిద్ధమనియు, సాధ్యమనియు రెండువిధములనియు, సిద్ధసాధ్యానుస్వారములు తిరుగ బూర్ణార్ధ భేదములచే రెండువిధములుగ