పుట:Andhra bhasha charitramu part 1.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధ్య: నేపధ్య = నేపచ్చ; రథ్యా = రచ్చా మొద.

ద్య: మాద్యతి = అప. మచ్చఇ

స్స: స్సాత = చాత, చాఅ; అప్సరా = అచ్ఛరా మొద.

ర్త్య: నిశ్చయ = ణిచ్ఛయ, ణిచ్ఛఅ; నిశ్చల = ణిచ్చల; దుశ్చరిత = దుచ్చరిఅ; హరిశ్చంద్ర = హలిచ్చంద, మొద.

ష్వ: పితృష్వసా = పిఉచ్ఛా, మాతృష్వసా = మాఉచ్ఛా మొద.

జ్య: రజ్యసె = అప, రచ్చసి.

ప్రాకృతమునందలి జ, జ్జ, జ్ఝ, లకు మూలములు సంస్కృతము నందలి క్ష, జ, జ్య, ద్య, ధ్య, ద్వ, ధ్వ, బ్జ, య, య్య, ర్య, హ్య యనునవి. ఈ జ, జ్జ, జ్ఝ లును గొన్నియెడల దంత్యోచ్చారణము గలిగి యున్నట్లూహింప బడుచున్నది.

జ: జాయా = య్జాఆ; జ్వలతి = య్జలఇ.

జ్య: వాణిజ్యమ్ = వాణిజ్జం, రాజ్యమ్ = రజ్జం.

క్ష: క్షరతి = ఝరేఇ; క్షర్ = ఝురు; క్షీయతే = ఝిజ్జఇ, క్షీణ = ఝీణ.

ద్య: ద్యూత = జూద; అద్య = అజ్జ; ఉద్యాన = ఉజ్జాన.

ధ్య: ఉపాధ్యాయ = ఉఅజ్ఝాఅ; వింధ్య = వింఝు.

ద్వ: విద్వాన్ = నిజ్జం.

ధ్వ: ధ్వజ = ఝయ; ధ్వని = ఝుణి; బుధ్వా = బుజ్ఘా; సాధ్వస = సజ్ఝన.

బ్జ: కుబ్జ = కుజ్జో.

య: యమ = జమ; యది = జది; యథా = జధా; యౌవన = జొవ్వణ.

య్య: శయ్యా = సెజ్జా.

ర్య: ఆర్యా = అజ్జా; కార్య = కజ్జ.

హ్య: సహ్య = సజ్ఘ; గుహ్య = గుజ్ఘ దంత్య చ, జ, లు ప్రాచీన ప్రాకృతములం దుండెడివనుటకు నిదర్శనము నేటి యార్యభాషలందును నవి కానంబడుటయే. నేటి మరాఠీ భాషయందు మాత్రమవి కానబడుచున్నవని యొకరనిరిగాని, యవి యింకను కాశ్మీరి, పశ్చిమ పహాడీభాషలు, మార్వాడీ భాషలలో మిక్కిలి ప్రచారమున నున్నవి. చ, జ, లేకాక వానియొత్తులగు ఛ, ఝ లు గూడ నాభాషలలో దంత్యోచ్చారణమును గలిగియున్నవి.

(విసర్గము): ఇది పాలిభాషలో జిహ్వామూలీయముగ మాత్రము కనబడుచున్నది: దు:ఖో