పుట:Andhra bhasha charitramu part 1.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఔ: సౌ అరియ = సౌదర్య; కౌలవ = కౌరవ (హేమచంద్రుడు, ప్రాకృతచంద్రిక, చండుని ప్రాకృతలక్షణము.)

ౘ, ౙ: "చజౌతజ్జే ప్రాకృతేచ దంత్యాదేవ నసంశయ:" అని యప్పకవి తన ఛందోగ్రంథమునం దధోక్షజవచనముగ నుదాహరించినాడు. ఆ వ్యకమునే యహోబలుడు వ్రాసినాడు. ఈ వాక్యము నిరాధారమని కొంద ఱందురు. కాని, ప్రాకృతభాషలను నుత్తర హిందూస్థాన భాషలను బరిశోధించిన జేమ్సు హొయర్నెల్ పండితులు ప్రాకృతమున దంత్య ౘ, ౙ, లుండెననియే యభిప్రాయపడి యున్నారు. వాని దంత్యోచ్చారణమును దెలుపుటకు గొన్ని ప్రాకృతములలో వానివెనుక 'య్‌' కారమును జేర్చుచుండిరని వారి యభిప్రాయము. ఉదా. తిష్ట = య్చిష్ఠ; చిరమ్ = య్చిలమ్: జాయా = య్జాఆ; య్చలఆ = చరక: య్చలఇ = చలతి, య్జలఇ = జ్వలతి; మొదలగువానిలో చ, జ, ల దంత్యోచ్చారణమును దెలుపుట కట్లు ప్రాకృతమున జేర్చియుండవచ్చును. సంస్కృత శబ్దములందలి క్ష, చ, చ్చ, చ్ఛ, జ, త్య, త్వ, త్స, ధ్య, ద్య, ప్స, ర్త్య, శ్చ, ష్వ, జ్యలు కొన్ని సందర్భములందు కొన్నిప్రాకృతములలో ౘ, చ్చ, ఛ,చ్ఛ, లుగ మాఱుచుండును. అట్టి చ, ఛ, లు అ, ఆ, ఉ, ఊ; ఐ, ఔలతో గలిసి దంత్యములయి యుండవచ్చును.

క్ష: క్షుర = ఛుర: ఇక్షు = ఉచ్ఛూ, క్షుధా = ఛుధా; క్షమా = ఛమా; క్షత = ఛత; క్షణ = ఛణ: కక్ష = కచ్ఛ; పరీక్షా = పరిచ్ఛా; అక్ష = అచ్ఛ; తక్షతి = తచ్ఛఇ, తచ్ఛయి; వృక్ష = వచ్చ, మొద

చ: చరక = య్చలఆ: చలతి = య్చలఇ; చత్వర = చత్తర, మొద.

చ్య: పచ్యమాన = పచ్చమాన; ముచ్యతే = ముచ్చతి; రుచ్యతే = రుచ్చతి.

చ్ఛ: ఆచ్ఛల = అచ్చల మొద.

జ: ప్రజతి = పచ్చఇ.

త్య: అత్యంత = అచ్చంత; నృత్యతి = ణచ్చఇ, దౌత్య = దొచ్చ; వైయాపృత్య = వేయాపచ్చ; సత్య = సచ్చ; నిత్య = నిచ్చ.

త్వ: చత్వర = చచ్చర; తత్త్వ = తచ్చ; కృత్వా = కిచ్చా; శ్రుత్వా = సొచ్చా; భుక్త్వా = భొచ్చా మొద.

త్స: ఉత్సాహ = ఉచ్ఛాహ; వత్స = వచ్ఛ; ఉత్సవ = ఉచ్ఛవ; సంవత్సర = సంవచ్చర మొద.