పుట:Andhra bhasha charitramu part 1.pdf/250

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


డచ్చు గూటమునందు 509 యక్షరములకు సంబంధించినవి. 10 యింగ్లీషంకెలు, 10 తెనుగంకెలు, 14 విరామచిహ్నములు, 5 ఇతర చిహ్నములు, రెండు కొటేషనుమార్కులు, 3 లీడర్లు, 8 అధో నిర్దేశకచిహ్నములు, మఱి 22 అనావశ్యక సంయుక్తాక్షరములు - మొత్తము 583 ప్రత్యేక సీసకాక్షరము లున్నవి. ఇందుమూలమున దెనుగున నచ్చుకేసు మిక్కిలి యెత్తు, పొడవు, వెడల్పు గలిగియుండుటచే నచ్చు గూర్చువా డెల్లప్పుడును నిలువబడి, యిటునటు దిరుగుచు, మీది కెగురులాడుచు నెంతో శ్రమపడవలసి వచ్చుచున్నది. ఇందువలన అచ్చు, కాగితములు, కూలి, మొదలగు వానిపై వ్యయ మెక్కువ యగుచున్నది. ఈ యసౌకర్యములు లేకుండిన నాంధ్రగ్రంధ ప్రకటనము సులభమై విద్యావ్యాప్తికి మార్గ మేర్పడగలదు. ఇట్లే, తెనుగునకును గొన్ని భాషలకువలె టైపు-రైటింగు సౌకర్యముకలిగి, వర్తకమున నెంతో సహాయకారి కాగలదు. ఇంతటి లాభముతో గూడిన యాంధ్రలిపి సంస్కారమునుగూర్చి యాలోచింపకుండుట మంచిదికాదు.

ఆంధ్రలిపి సంస్కారమునకు బూనక పూర్వము దానియందు గల లోపము లెవ్వియో విచారింపవలసియున్నది.

అక్షరములన్నియు నేదియో యొకపద్ధతిపై నేర్పడకుండుట.

1. క, గ, చ, ఛ, ఝ, ఠ, డ, ఢ, త, థ, ద, ధ, న, భ, మ, య, ర, వ, శ, హ, ళ, క్ష - వీనిలో దలకట్టులక్షరము తలకు తగిలియున్నవి.

2. ఘ, ప, ఫ, ష, స - వీనిలో దలకట్టు లక్షరములనుండి వేర్పడి యున్నవి.

3. ఖ, జ, ట, ణ, బ, ల - వీనికి దలకట్టులేదు.

4. ఙ్, జ, ఞ్ - ఇవి ఒ, ఇ. లకు + U, చిహ్నముల జేర్చుటవలన గలిగినవి.

5. ట - ఇది ఉ కడుపలోని యడ్డుగీతను తీసివేయుటవలన గలిగినది.

6. ఛ, ఢ, ధ, ఫ, - ఈ యొత్తక్షరములు వాని సాధురూపముల పొక్కిలిలో నొత్తుచిహ్నమును చేర్చుటవలన గలిగినది.

7. ఖ, ఘ, ఝ, ర, ధ - వీనికిని వీని సాధురూపములకును బోలికలేదు.

8. భ - దీనిసాధు రూపమగు 'బ' కు తలకట్టులేదు; దానికి ఒత్తు చేర్చు నప్పుడు తలకట్టును దగిలించవలెను.

9. ౦, ర, ర, ఈ, ఝ, య; అ, ఆ, ఱ; ఇ, ఞ; ట, ఉ, ఊ; ఌ, ౡ; ఎ, ఏ, ఐ, ప, ఫ, ఘ, మ, వ, హ, ష; ఒ, ఓ, ఔ, ఙ, జ, బ, భ, ఋ, ౠ, చ, ఛ; ద, ధ, థ, డ, ఢ, ఖ, శ, ళ, స, న; - ఈ వర్గములం