పుట:Andhra bhasha charitramu part 1.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దలి యక్షరములు గ్రమముగ నొక్కటే మూలరూపములనుండి యేర్పడినవి. కాని, రూపసామ్యమునుబట్టి యుచ్చారణ సామ్యము స్ఫురించదు.

10. అ, ఉ, ఋ, ఌ,ఎ, ఒ, లనుండియే వానిదీర్ఘము లేర్పడినవి; కాని, 'ఇ' నుండి 'ఈ' కలుగలేదు.

11. వ్రాతలో 'క' కు కన్నడమునందలి 'క' వంటి మఱియొక రూపము కూడ వ్యవహారమున నిలిచినది.

ii. గుణింతము.

(అ) అచ్చులు.

1. క, గ, ఘ, చ, ఛ, ఝ, ఠ, డ, ఢ, త, థ, ద, ధ, న, ప, ఫ, భ, ర, వ, స, శ, ష, ళ - వీనికి, గుడి, గుడిదీర్ఘము, ఎత్వ, ఏత్వ, ఒత్వ, ఓత్వ, ఔత్వములు చేరునప్పుడు, తలకట్టుతొలగి యా స్థానముననే యాయాచిహ్నములు నిలుచును. ఉ, ఊ, ఋ, ౠ, ఌ, లు చేరునప్పుడు తలకట్టు కూడ నిలుచును.

2. ఈ, ఊ, ప, ఫ, ష, స, లకు దీర్ఘమాయక్షరముల మధ్యముగ బోవును.

3. క, గ, చ, ఛ, ఠ, డ, ఢ, త, థ, ద, ధ, న, భ, ర, వ, శ, ళ - వీనికి దీర్ఘమిచ్చునప్పుడు తలకట్టుపోయి, దానిస్థానముననే దీర్ఘచిహ్నముపై చేరును.

4. స, ణ లకు దీర్ఘము ఇ, ఈ, ఎ, ఏ, ఒ, ఓ, ఔ, లవలె దలపఒ గుడిప్రక్క బ్రత్యేకముగ జేరును.

5. బ, ల - ల దీర్ఘము తలపై కుడిప్రక్క నక్షరమునకు గలసిచేరును.

6. బ, ల, శ, ళ - వీని గుడిచిహ్నము తల కుడివైపున నక్షరము లోనికి పోవును.

7. 'ట' కు దలపై నచ్చులు చేరునప్పుడు పై నిలువుగీత తొలగి పోవును.

8. మ, య, ఘ, జ, ఝ, ట, బ - వీనికి దీర్ఘ మక్షరముతుట్టతుదను చేరును.

9. 'య' కుగుడి ప్రత్యేకముగ నీయ నక్కఱలేదు. తలకట్టును దొలగించిన జాలును. 'యి' కి తుట్టతుదను 'ఆ' త్వసంజ్ఞ చేరుటచే 'ఈ' త్వమేర్పడును.