పుట:Andhra bhasha charitramu part 1.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15. ఒడ్డ:- ఒడ్డగిల్లు, ఒడ్డగెడవు, ఒడ్డొఱకము:- 'ఒడ్డ'కు తెనుగున ధాతువులేదు. ఇది 'ఒడ్డు' అను ధాతువునుండి పుట్టినదికాదు.

16. ఒత్త:- ఒత్తగిల్లు, ఒత్తరము, ఒత్తిల్లు:- ఇది 'ఒడ్డ' వంటిదే.

17. ఒన:- ఒనగూడు ఇది 'ఒడ-' వంటిది.

18. ఒఱ:- ఒఱకటము, ఒఱకము, ఒఱకాటము, ఒఱగడ్డము, ఒఱగొడ్డెము: దీనికిని విశేష్యమైన 'ఒఱ', క్రియయగు 'ఒఱగు' లకును సంబంధములేదు.

19. కీడు-కీడ్పడు, కీడ్పాటు:- దీనికి 'కీడు=హాని' అను నర్థముతో సంబంధములేదు; 'కీఱ్=క్రింద' అనుదానినుండి పుట్టినది. ఈ యర్థమున నీ శబ్దమునకు దెనుగున బ్రత్యేకముగ బ్రయోగములేదు.

20. కై:- కైసేత, కేసేయు:- వీనిలో 'కై' అనుదానికి ప్రత్యేక ప్రయోగములేదు. కై=చేయి, అనుపదముతో దీనికి సంబంధములేదు.

21. కొన గొన:- కొన(గొన) కొను-దీనిలోని 'కొన'కు బ్రత్యేక ప్రయోగములేదు. కొన=చివర, అంతము, అనుపదముతో దీనికి సంబంధములేదు. దీనితో సంబంధించి క్రియగూడ దెనుగునలేదు.

22. కొని-కొనియాడు, కొనియాట:- దీనికి సంబంధించిన స్తుత్యర్థకక్రియ తెనుగున లేదు.

23. కోలు:- కోలుకొను, కోల్తల-కొను, ధాతువులోగాని, మఱియొక తెనుగు విశేష్యముతో గాని దీనికి సంబంధములేదు.

24. గడి:- గడికాళ్లు, గడిత్రాడు, గడివేఱు, గడిదొంగ, గడిపోతు. ఈ యర్థములందు దీనితో సంబంధించిన విశేష్యముగాని, క్రియగాని తెనుగున లేదు.

25. గిర:- గిరవాటు=విసరుట.

26. తార:- తారకాణించు, తారకాణ.

27. త్రెక్:- త్రెక్కొట్టు, త్రెక్కొను, త్రెక్కోలు, త్రేక్కోలు గొను.- ఇది 'త్రెగు=తెగు' అను నర్థముగలది కాదు.

28. దా(డా):- దాపల, డాపల; ఇది 'దక్షిణ' శబ్దభవము. 'దా' కు ప్రత్యేక ప్రయోగము లేదు.

29. దిగ:- దిగదుడుచు, దిగద్రావు, దిగనాడు, దిగవిడుచు, మొద. చూ. ఎగ.