పుట:Andhra bhasha charitramu part 1.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30. నిఱు:- నిఱుపేద మొద.

31. నివ్(=నిర్):- నివ్వెర, నివ్వెఱ, నివ్వెఱగు.

32. నూలు:- నూలుకొను, నూలుకోలు; "నూలు=దారము" అను పదముతో దీనికి సంబంధములేదు.

33. పడి:- పడిగల్లు, పడికట్టు, పడిగాపు, పడితరము, పడియచ్చు, పడివాగె. మొద. దీనికిని 'ప్రతి' కిని సంబంధముండ నోపు.

34. పరి:- పరికాడు, పరిగొను, పరిడవము, పరిడవించు (-ల్లు), పరిమాఱుచు, పరిసెనము.

35. పఱి:- పఱిగొను, పఱివోపు.

36. పిరు, పిఱు:- పిరువీకు, పిఱితివుచు, పిఱువడ్డు, మొద. 'పిరు=వెనుక, అని ద్రావిడభాషలలో నర్థము. దీనికి దెనుగున బ్రత్యేక ప్రయోగములేదు.

37. మెయి, మై, మయి, మే,-: మెయికొను, మెయికోలు, మెయిపాలు, మెయి, మెయివడి, మెయి(మే)గలి

38. మెఱ:- మెఱమెచ్చు, మెఱవడి.

39. మడి:- మడిమంచ, మడిసంది.

40. మేలు:- మేలుకట్టు, మేలుకొను, మేలుచేయి, మేలుబంతి, మేలుమచ్చు; మేలు=వై' అను నర్థము ద్రావిడభాషల యందున్నను దెనుగున నాయర్థజ్ఞాన మంతరించినది.

41. సమ:- సమకట్టు, సమకుఱు, సమకూడు, సమకూరు, సమకొను, సమకోలు. - ఇది 'సం' అను నుపసర్గము వికారమై యుండును.

42. సయి:- సై, - సైదోడు. ('సహ' అను సవ్యయమునుండి పుట్టినది.)

ప్రత్యయములు.

భారతీయ భాషలలోని ప్రత్యయముల గూర్చిన పరిశోధనములందు హొయిర్నెల్‌గా రుత్తరార్యభాషల ప్రత్యయముల గూర్చి చేసినది చాల ముఖ్యముగా నున్నది. ఆ పరిశోధన ఫలితములను నేటికి నెవ్వరును ద్రోసిపుచ్చక ప్రమాణముగ జేకొనుచున్నారు. చిన్న చిన్న విషయముల దప్ప నాతని సిద్ధాంతములను బండితులందఱు నంగీకరించుచున్నారు. కాని, ద్రావిడభాషలయందలి ప్రత్యయముల గూర్చి విచారించిన వారిలో బ్రథములును దుదివారును నగు కాల్డువెల్లుగారు మొదటినుండియు దప్పుత్రోవనే త్రొక్కుటవలన వారికితేలిన సిద్ధాంతములును విపరీతములుగనే