పుట:Andhra bhasha charitramu part 1.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. ధాతువు + (ఆప్) చాపు (సాధ్); మలపు (మృద్); రేపు(రిచ్).

2. ఉపసర్గము+ధాతువు: ఆపు (ఆపహృ); ఊపు (ఉపహృ, ఉజ్ఘాప్).

3. తద్ధితరూపము+ఆప్: చేపు (సీధు).

35 - ౦పు.

1. ఉపసర్గము+ధాతువు: నింపు (నిరాప్); పంపు (ప్రాప్).

2. ధాతువు+ఆప్: చింపు (ఛిదాప్); చంపు, సంపు (శవాప్); డింపు (డీ); తె (త్రెం)పు (త్రుట్, త్రక్ష్, తక్ష్); దంపు (దంశ్); పెంపు (వృధ్).

3. ఉపసర్గము+ధాతువు+ఆప్: అంపు (ఆజ్ఞాప్).

36 - పు.

1. ధాతువు+ఆప్: అఱపు (అశ్, అర్శ్); కఱపు (కృష్); చదుపు, చిదుపు, చెఱపు (ఛిద్); చలుపు, సలుపు, సళుపు (చల్); జరపు (సృ); తరపు (తౄ); తిఱపు (తృష్), నడ(దు)పు (నట్); నానుపు (స్నా); నిలుపు (నిష్ఠ్, తిష్ఠ్); పఱపు (పత్); పఱుపు (ఫల్); మలపు, మెదుపు (మృద్); మాపు (మ్లశ్); మెనుపు (మన్థ్); గిలు (ఱు)పు (క్షిప్).

2. ధాతువు+వికరణచిహ్నము+ఆప్: కలపు (చూ, కలయతి); చొనుపు (సృ, స్యూ).

3. ధాతువున ననునాసికము చేరుట: తనుపు (తృమ్ప్).

4. ఉపసర్గము+ధాతువు: ఓపు (అవాప్).

5. ఉపసర్గము+ధాతువు+ఆప్: అనుపు (ఆజ్ఞాప్); నెర(ఱ)పు (నిర్వర్త్); పాపు (అపాన్).

6. క్రియాజన్య విశేషణము+ఆప్: కడపు (ఘ్నత, క్షత); కొడపు (క్లిష్ట, కృష్ట); కొలుపు (కృత); దులుపు, దొలుపు (ధూత); నుఱు(లు)పు (నుద్); పెనుపు (పినద్ధ).

7. ఉపసర్గము+క్రియాజన్య విశేషణము+ఆప్: ఉడు(లు)పు (ఉపహత).

37 - ప్పు.

1. ధాతువు+ఆప్: ఉప్పు (ఉష్); కప్పు (ఛద్); గుప్పు (క్షిప్); తప్పు -----(స్తృ); దెప్పు (దిశ్); రొ (రు) ప్పు (రుద్, రుష్).

2. --------+ ధాతువు: ఒప్పు (అవాప్).

3. --------+ధాతువు+ఆప్: విప్పు (వ్యస్).