పుట:Andhra bhasha charitramu part 1.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. ఆధుని కార్యభాషల యందును ద్రావిడభాషల యందును గూడ విశేషణములకు దరతమ భావము దెలుపు ప్రత్యయములు లేవు. ప్రాచీన ఇండో-ఆర్యప్రత్యయములగు ఈయన్, ఇష్ఠ ; తర, తమ, అనునవి లోపించినవి. ఈ భావము, విశేష్యమును చతుర్థీ, పంచమీ, లేక సప్తమీ విభక్తుల యందుంచి దానితో విశేష్యజమైనట్టి కాని, క్రియా సంబంధమైనట్టికాని యొక మాటను చేర్చుటవలన దెలుపబడుచున్నది.

ఉదాహరణములు:- బంగాలీ: ఏర్ చేయే-ఖాలో=దీనిని చూచిన మేలు; సబార్ మాఝే ఖాలో=అన్నిటి మధ్యను మంచిది, మొ. ద్రావిడభాషలలో గూడ తర-తమభావమిట్లే తెలుపబడును. నేటి యిండో యూరోపియను భాషలలో గొన్ని యెడల నీ భావము ప్రత్యయముల మూలముననే తెలుపబడుచున్నది.

ఉదాహరణము:- పెర్షియను: తర్, తరీన్; ఆర్మీనియను: కుఇన్ = గొఇన్ ; ఆధునిక గ్రీకు: తెరొస్, తతొస్ ; రషియను: జెఇశిఇ, జీ ; ఇంగ్లీషు: ఎర్, ఎష్ట్. కొన్నియెడల తరతమ భావమును దెలుపు ప్రత్యేకశబ్దములు వాడబడు చున్నవి.

ఉదాహరణము:- ఇంగ్లీషు: మోర్, మోస్ట్; ఫ్రెంచి: ప్లుస్, లేప్లుస్; ఆధునిక గ్రీకు: ప్లెబస్, ఒ ప్లెబస్.

3. ధాతువులం దర్థభేదముల గలిగించుట కుపసర్గలు లోపించినందున నాధునికార్యభాషలయందును ద్రావిడభాషలయందును నొక్కటే తీరున త్వార్థకములును క్రియా విశేషణములును నవ్యయార్థములందు దాతువులతో జేరి ధాతుపల్లవము లేర్పడినవి.

ఉదాహరణములు:- సంస్కృతము: నిషద్; ఇంగ్లీషు: సిట్ డౌన్; బంగాలీ: బసియా పఱా; హిందీ:బైఠ్‌జానా; ఇంగ్లీషు: రబ్‌ఆఫ్, బంగాలీ: ముచియా ఫేలా. ఇట్టి వాడుక ద్రావిడభాషలయందును గలదు.

4. ప్రాచీ నార్యభాషలలోని దశవిధ లకారములందు చాలమట్టుకు లోపములు కలిగినవి. అట్లే యైరేనియను భాషలలోగూడ జాలవఱకు లకారము లంతరించినవి. వైదికభాషలో సోగమత్, సోగచ్ఛత్, సజగామ అను రూపములకు బ్రాకృతములందు స గత: అను రూపమువికారము లగు సో గదో, సో గఓ, శే గడే, శి గయిల్ల, సు గఉ, సొ గఅఉ, మొదలగు రూపములు గలిగెను. వానినుండియే యాధుని కార్యభాషలయందు పశ్చిమ హిందీ సో గయవ్, గయా: బంగాలీ: సే గేల, మొదలగు రూపములు కలిగెను. ఈమార్పు ద్రావిడభాషా సంపర్కమువలన గలిగియుండును. ద్రావి