పుట:Andhra bhasha charitramu part 1.pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చేరుటయు మే, మా (మధ్య), కో (కక్ష), ఠాయ్ (స్థామ),పాస్ (పార్శ్వ), సే (సహిత), దా (దిత), కా (కృత), మొదలగునవి విభక్తి ప్రితిరూప కావ్యయములుగ ద్రావిడభాషలయందువలె కానబడుచున్నవి. ఇట్లే బంగాళీ భాషలో హైతే, లాగియా, ధాకియా, దియా, యనునవియు నాధునికార్యభాషలలోని యిట్టిరూపములను క్రియా విశేషణములును త్వార్థకములునైన ప్రత్యయములుగ వాడబడుట ద్రావిడాభాషా సంప్రదాయము ననుసరించి యున్నది తమిళములో, కత్తియైకొణ్డు (కత్తిగొని), అవనోడు (వానితోడ), ఇన్ఱు, నిన్ఱు (నిలిచి), మొదలగు రూపముల నీ సందర్భమున నుదాహరింప వచ్చును.

అమహద్వాచకములకు జతుర్థీ-ద్వితీయా ప్రత్యయమగు నాధునిక ఇండో-ఆర్యభాషలలోని కో, కే, కు, ప్రత్యయములును ద్రావిడభాషలలోని కుప్రత్యయమును జేరకుండుట రెండు కుటుంబములయందును గాన్పించు చున్నది.

పైని వివరించిన విషయములు దాధుని కార్యభాషలకు ద్రావిడ సంపర్కము నూహించుటకు వీలున్నది. కాని యిట్టిమార్పులు ద్రావిడభాషా మూలముననే గలిగినవని చెప్ప వీలులేదు. ఆధుని కార్యభాషలలో బశ్చిమ హిందీ భాషయందు 'కో', బంగాళీభాష యందు 'కే', ఒఱియా భాషయందు 'కు' అను ప్రత్యయములు ప్రాకృత భాషావస్థయందును నాధుని కార్యభాషలయందును 'కక్ష' యను సంస్కృత పదమునుండి యేర్పడుటకును ద్రావిడ భాషలలోని కుప్రత్యమునకును నెట్టి సంబంధమును లేదు. ఈ ప్రత్యయములు రెండుకుటుంబముల యందును బోలియుండుట కాకతాలీయన్యాయమున గలిగినది గాని వేఱుగాదు. ఇట్లే బంగాళీభాషలో బదనాల్గవ శతాబ్దమున వాడుకలోనికి వచ్చిన రా, గులా, (గులి) అను బహువచన ప్రత్యయములకును ద్రావిడభాషలలోని ఆర్, గళ్, ప్రత్యయములకును సంబంధమున్నదని చెప్పుట మిక్కిలి సాహసము. బంగాలీభాషలో (రా) ప్రత్యయమును ద్రావిడ భాషలలో (ఆర్) ప్రత్యయమును గూడ మహద్వాచకముల తోడనే చేరినను నీరెంటికిని సంబంధమున్నదని చెప్పగూడదు.

ఆధుని కార్యభాషల యందును ద్రావిడభాషల యందును విశేష్యములు విశేషణములుగ నుపయోగింప వీలగుట యీ రెండు కుటుంబములకును సామాన్యలక్షణముగ గొందఱు చెప్పుదురు.

ఉదాహరణము:- బంగాలీ; సోనార్ - బాటీ; తమిళ్: పొన్నిన్ - కుడమ్=బంగారుగిన్నె. కాని యిట్టి వాడుక యింక ననేకభాషలలోగూడ నుండుటచే నది కేవల ద్రావిడభాషా లక్షణమేయని చెప్పగూడదు.