పుట:Andhra bhasha charitramu part 1.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొన్నికొన్ని భాషలయందు మాత్రము మిగిలినవి. భవిష్యతి అనుటకు గొన్ని భాషలలో 'భవితవ్యం' అను రూపము రూడిగ నిలిచినది. అట్లె 'అగచ్ఛత్‌' అను లజ్ రూపమునకు బదులు 'గత:' అను రూపమే వాడుకలోనికి వచ్చినది. 'అహం అగచ్ఛం' అనుటకు బదులు 'మయాగతం' అని వాడవచ్చును. అప్పుడు 'గతం' అనుదానితో నెట్టి తృతీయా రూపమును వాడినను అదిమాత్రము మాఱదు. 'తేనగతం' 'తయాగతం' 'జనైర్గతం' అని యీరీతిగా వాడుకొనవచ్చును. లేదా 'మే' మొదలగు ప్రత్యయములనైన నీసందర్భమున వాడుకొన వచ్చును. ఇట్టి ప్రత్యయములు పూర్వశబ్దములతో సమసించి ప్రత్యేకింప వీలు లేక యుండును. అందుచేత మూడు పురుషము లందును వేర్వేరు క్రియా రూపము లేర్పడును. మధ్యదేశీయ ప్రాకృతభాషలలో గ్రియారూపములకు మాఱుగ క్రియాజన్య విశేషణములే మూడు పురుషములందును నెట్టిమార్పులును లేక వాడబడుచుండ వానికి చుట్టునుండు ప్రాకృతభాషలలో పురుషమును బట్టియు వచనమును బట్టియు గ్రియారూపములు మాఱుచుండును.

ఈ లక్షణభేదముల ననుసరించి ఉత్తరహిందూస్థానభాష లీ క్రిందిరీతిగా వర్గీకరింప బడినవి.

(అ) బయటి అంతశ్శాఖ.

I. వాయవ్య వర్గము.

1. లహందా

2. సింధి.

II. దాక్షిణాత్య వర్గము.

3. మరాఠీ

III. ప్రాచ్యవర్గము.

4. ఒఱియా

5. బిహారీ

6. బంగాలీ

7. అస్సామీ

(ఆ) మధ్యాంతశ్శాఖ.

IV. మధ్యదేశీయ వర్గము.

8. తూర్పుహిందీ