పుట:Andhra bhasha charitramu part 1.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(ఇ) లోపలి యంతశ్శాఖ.

V. మధ్య వర్గము.

9. పడమటి హిందీ

10. పంజాబీ

11. గుజరాతి

12. భీలీ

13. ఖాన్‌దేశీ

14. రాజస్థానీ

VI. పహాఱీ వర్గము.

15. తూర్పు పహాఱీ లేక నైపాలీ

16. మధ్యపహాఱీ

17. పడమటి పహాఱీ.

6. ఋగ్వేదభాష వాడుకభాషగా నుండెను. అదియును దానికిసంబంధించిన తక్కిన వాడుకభాషలును బరిణామము నొందుచువచ్చెను. అందొకటి సంస్కృతభాషగ వైయాకరణులచే స్థిరత్వమునొందెను. తక్కినభాషలు మాఱుచునేయుండెను. ఆభాషలు ప్రాకృతమనుపేర వ్యవహరింపబడుచుండెను. వైదికప్రాకృతములకు , బ్రాధమిక ప్రాకృతములనియు, వీనినుండి తఱువాత నేర్పడిన ప్రాకృతములకు ద్వైతీయ ప్రాకృతములనియు, వాని నుండి పరిణమించిన నేటి యార్యభాషలకు దార్తీయ ప్రాకృతములనియు సంజ్ఞలను పరిశోధకు లిచ్చియున్నారు. ప్రాధమిక ప్రాకృతములందు సుప్తిజ్ విధానము సంపూర్ణముగనుండెను. ఉచ్చారణకాఠిన్యముగల సంయుక్తాక్షరములు ప్రచారములోనుండెను. ద్వైతీయావస్థలో సుప్తిజ్‌ విధానము నిలిచియున్నను ఐ జౌలును కఠినసంయుక్తాక్షరములును లోపించినవి. పదమధ్యములందు హల్లులే లోపించి కేవలమచ్చులే నిలిచియుండుట సంభవించినది ఇందు వలన తార్తీయావస్థయం దీయచ్చులు కలిసి వేఱురూపములను బొందుటయో, వానిమధ్యమున గ్రొత్తహల్లులు చేరుటయో సంభవించినది. సుప్తిజ్ ప్రత్యయములు లోపించినవి. క్రొత్తసంయుక్తాక్షరము లేర్పడినవి.

పాలిభాష ద్వైతీయావస్థకు జెందినది. బౌద్ధమతగ్రంధము లీభాష యందు వ్రాయబడినవి. ఈభాష గ్రాంధికము కాగానే స్థిరరూపమును బొందెను. కాని వ్యావహారిక ప్రాకృతము లింకను మాఱుచునే వచ్చెను. ఈ ప్రాకృతములుకూడ కొలదికాలములో గ్రంధస్థములయ్యెను. కాని పండితుల చేతులలోబడి యీప్రాకృతములు సంస్కారమునుబొంద నారంభిం