పుట:Andhra Pandita Bhishakkula Bhasa Bhesajam, Midhyapavadamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపాదకీయ భూమిక

శ్రీ రామమూర్తి పంతులుగారు వ్యావహారిక భాషను పునః ప్రతిష్ఠితము చేయడానికి సుమారు పాతిక సంవత్సరములనుం చి చేస్తూవున్న వాదములో ప్రధానముగా నాలుగు మార్గములు గోచరిస్తున్న వి.

భాషాతత్త్వ ప్రదర్శన పూర్వకముగా ప్రపంచములోని ఇతర భాషా వాజ్మయముల చరే ప్రములున్ను వాటితోపోల్చి ఆంధ్రభాషానాజ్మయముల చరిత్రములున్ను బోధించి తక్కిన భాషలవలెనే తెలుగుకూడా నానాటికి మారుతూ వచ్చినదనీ, ఆయాకాలముల-కవులు తమనాడు శిష్టవ్యవహార సిద్దమయిన భాషను కావ్యాలలో ప్రయోగిస్తూవచ్చి నారనీ, నేటి రచయితలు కూడా ఈ శిష్టాచార మే పాటించి వ్యావహారిక భాషలో గ్రంధములు వ్రాస్తే భాషాప్రయోజనము చక్కగా నెరవేరుతుందనీ, నోటిమాటకూ చేతివ్రాతకూ సామరస్యము కుదిరి ఒకదాని కొకటి పోషక ముగా ఉన్నప్పుడే వాజ్మయము లోని భాష సహజముగానూ, సరళముగానూ, సుబోధకము గానూ పరమ ప్రయోజనకారిగానూ ఉంటుందనీ' నిరూపించడము ఒకమార్గము.

వ్యావహారిక భాషను బహిష్కరించి గ్రాంథికాంధ్రమును దాని స్థాన ములో నెలకొల్పడానికి ప్రయత్నిస్తూ ఉన్న వారు ప్రాచీన తాళపత్రగ్రంథ ములో ఉన్న లౌకికభాషను ఎట్లు (గాంథికీకరణముచేసి కూటకరణ దోషమునకు పాల్పడి భాషకు అపారమయిన అనర్ధము కలుగజేసినారో ఋజువు చేసి పూర్వులు వ్రాసిన పురాణ (వచన) ములూ,లక్షణగ్రంధములూ , వ్యాఖ్యానములూ, టీకలూ, వివిధశాస్త్రగ్రంధములూ, దేశచరిత్రములూ, జానపదవృత్తాంతములూ, వార్తాపత్రికలూ, శాసనములూ, కథలూ, బడి పుస్తకములూ మొదలయిన అన్ని విధముల రచనలలోనూ వచనము వ్యావ హారిక భాషలో నే ఉన్నదని నిదర్శనపూర్వకముగా సిద్ధాంతీక రించి, ఏ