ii
భావలోనయినా ఇదే నిజమయిన వచనరచనా సంప్రదాయమని నిరూపించడము రెండోది.
'గ్రాంథిక భాష' అని మన పండితులు వ్యవహరించేదాని స్వరూపము ఇదమిద్ధమని నిర్ణయించడానికి వల్ల పడదనీ, మన వ్యాకరణములు పరస్పరవిరుద్ధములుగానూ, ఆసమగ్రములుగానూ ఉండడమువల్ల ఏది తప్పో ఏది ఒప్పో నిర్ధారణ చేయడము దుష్కరమనీ, ఒక పండితుడికి గ్రాహ్యమయిన ప్రయోగము ఇంకొకరీమతములో అగ్రాహ్యమనీ, ఒక మహామహోపాధ్యాయుల గ్రంథాలలో ఇంకో మహామహోపాధ్యాయుల వారికి వేనవేలు తప్పులు కానవస్తూ ఉన్నవనీ, గ్రాంథిక భాషలో నిర్దుష్టముగా వ్రాసిన గ్రంధము మచ్చుకి ఒక్కటిఅయినా లేదనీ, గ్రాంథిక భాష పండిత ప్రకాంశులకయినా సాధ్యపడక ఇంత అవ్యవస్థముగా ఉన్నదనీ ప్రాచీన బాషలో శబ్దస్వరూపమూ శబ్దార్ధమూ నిర్ణయించడమే బహుకష్టముగా ఉన్నందువల్ల ఆ భాషలో స్వతంత్రరచన సాగించడము అసంభవమనీ నిరూపించడము మూడోచూర్ణము.
ప్రాచీనకవుల కావ్యములన్నీ సమగ్రముగా పరిశీలించకపోవడమువల్ల వ్యాకరణకర్తలూ, కోశకారులూ, పండితులూ తప్పులుగా భావించి లక్షణ విరుద్ధములనీ గ్రామ్యములనీ నిందించిన రూపములు వందలకొలదిగా కవుల కావ్యములలో ప్రయుక్తములై ఉన్నవనీ, వ్యాకరణము ప్రయోగమూలము కావడమువల్ల కవిప్రయోగము లక్షణముకంటె బలవత్తరమైనదనీ, కవులు ప్రయోగించిన రూపములు లక్ష్మణములో చెప్పకపోతే లక్షణమే అసమగ్రమూ దుష్టమూ అవుతుంది కాని ప్రయోగములు నింద్యములు కావనీ నిరూపించి, అట్టి రూపములకు....ప్రతిపక్షులు ఎదురాడుటకు వీలు లేనట్టుగా కవుల కావ్యములనుంచి వందలకొద్దీ ప్రయోగములు చూపి నిర్దుష్టత్వ మాపాదించడము నాలుగోమార్గము.
ఈ నాలుగుమార్గములూ వ్యక్తపరిచే గ్రంథములు వరుసగా శ్రీపంతులు గారీ సప్తతితమ జన్మదినోత్సవ ప్రచురణములలోని వ్యాసావళి, గద్య చింతామణి, ఆంధ్రపండితభివక్కుల భాషా భేషజము, కాలకవి శరణ్యమున్ను.