74
ఆంధ్రనాటక పద్యపఠనం
పదమో, స్వరమో, రంగో, రాయో! ఎన్నుకుని అప్పటి తన చిత్తవృత్తి సమగ్రంగా ప్రకటిస్తాడు. అతడు అనుకున్నరీతిగా పని జరిగిననాడు, తోడిమానవుల హృదయాల్లో ఆవిర్భవించేది 'రసం'. కవి స్వీకరించే సాధనం పదాలు. కవి పదాలు ప్రయోగిస్తాడు. కాబట్టి పద్యంలో రసం ఎంత విపులంగా ఉన్నా దాన్ని పదాల కూర్పుద్వారానే ఆస్వాదించాలి. ఆ పనిలో రాగమెందుకూ! రాగం అనేది ఏదో మున్ముందే మనకి వచ్చుండి, దాన్ని పలికించాలనే ఉద్దేశమే మనకి ఉన్నప్పుడు తప్ప దానంతట అది మనలోంచి బయల్దే రడం ఎట్లా? పద్యదర్శనం కాగానే రాగశూన్యుడికి రాగాలు పుడ తాయా! భోజమహారాజుని చూస్తే కవిత్వం పుట్టేదిట, అన్నట్టు ! తిన్నగా పద్యం చదవలేనివాడు మూలుగులోకి దిగచ్చుగాని రాగం లోకి ఎట్లా దిగుతాడూ! అసమర్దుడైన చదువరో పఠితో పద్యంలో ప్రవేశపెట్టిన మూలుగుని ఖండించడంబదులు, ఖాయపరిచి, ఖరీదుకట్టి అదిరాగం అయిపోవాలని పట్టుపట్టడం ఏమి సరసం ! ఇక, రాగపు మొహం ఎరక్కుండా పుట్టిన పద్యం, మనం దాన్ని ఎంత ఆస్వాదిస్తేం గనక, రాగంలోకి దానంతట అదే ఎల్లా దిగుతుందీ ? పోనీ, ఒక పద్యం లోని పదాలరసం యావత్తూ వెళ్లి ఒకేరాగపు సంగతుల్లోకి ఎట్లా దిగు తుందీ ? రంగంఎక్కిన నటుకు ఒక్కొక్క పద్యాన్ని ఎన్ని సార్లు తను ఆస్వాదించాలీ, ఇంతపనీ జరగడానికి ? ఎన్నిసార్లు శ్రోతలచేత ఆస్వా దింప చెయ్యాలీ ! పోనీ, ఒక నటుడికి గానంకుడా వచ్చు ననుకోండి, అతడికి తెలియకుండానే పద్యం ఏదో ఒక రాగంలోకి దిగుతుందను కోండి. కవిరచించిన పద్యంలోని పదాలన్నింటినీ సార్ధకంగా సభకి వడ్డిం చినపిమ్మట అన్యవ్య క్తిని స్ఫురింపచెయ్యవలసినవాడు, ఆ పదాలమధ్య తన స్వంత రాగ సంగతులు చిమ్ముతూ తన వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేసుగోవడం ఎందుకొచ్చినపనీ ? తనకి రాగం వచ్చినట్టు సభకి తెలియ