Jump to content

పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూర్వపంప్రదాయాలు 127 ఉండి యాసారప్రసారంబులు చేయు శంభళీ జనంబులచేతను మారాక యెఱింగించిన నబ్బోటి...' " అనే పట్టులో, కందంలోని 'మున్నూఱు' అనే మాటతో ప్రారంభం అయిన మహావాక్యానికి కర్త, కందం తరువాత ఉన్న గద్య లోని ‘బోటి' గనక, 'జోడరఁగులపై ఉండి' అని అన్వయము గనక, పద్యపూర్తి అయిన సూచనగా విశ్రాంతి కూడదనిన్నీ, వరసగా, రూపం పాటిస్తూ, భావద్యోతకం అయేలాగు, రచన పఠించాలనిన్నీ, కవి ఆశయం అయుంటుంది. ఇది కాక, అయిదో అశ్వాసంలో, శివుడు ప్రమథగణాల్తో కూడి కైలాసంనించి దక్షారామం వెళ్ళడానికి బయల్దేరినప్పుడు, శ్రీనాధుడు, హృద్యంబులగు గద్యపద్యంబులు తుంబురునార దాదులు పఠింప... అంటాడు. 'పఠింప' అనడంలో శ్రీనాధుడి తాత్పర్యం తుంబురు నారదాదులకి రాగాలు రావనా పద్యం పఠించవలిసింద నా? " 12 గురుజాడ అప్పారావుగారి బిల్హణీయం రెండవ అంకంలో : నా రాయణభట్టు . ఏదీ పద్యం కలిపిచదువు. శిష్యుడు - (చదువుతూ) అంకం కి మితి శశాంకే కథ మిహ నౄణాం విజాయతే శంకా ” - నారాయణభట్టు — తగలేశావురా, బంగారంలాంటి పద్యం ! కొంచెం రాXవరస పెట్టి యాడవ రాదూ?