Jump to content

పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

ఆంధ్రనాటక పద్యపఠనం

టారు, అల్లాంటివాళ్ళతో వైరం పెట్టుగోలేక. వాళ్ళు నటులమీద విరుచుగుపడిపోతారు. 'ఆ నాటకం బాగుండకపోతే, ఈ నటులు ఎందు కయ్యా అది ఆడడానికి సిద్ధపడడం? అసలు ఒకనాటకగ్రంధం రాగానే, అందులో ఉండగల పద్యాలు వెతిగి తన క్షుద్రరాగప్రజ్ఞతో వాటిని పాడుకుంటూకూచోకుండా, ఆనాటకం మంచినాటకమో కాదో చెప్ప గల నటుడేడండీ అసలూ ? తనకి వచ్చిన బంజరురాగాలతో విజృంభ ణంగా పాడుకుంటూ స్వారిచెయిడానికి పనికివచ్చే పద్యజంతువులు అందులో కనపడకపోతే, అదేం నాటకమండీ, వెధవ నాటకం ? ఎక్కడా పద్యంలేదు నా బొందాలేదు' అనే మోస్తరుగా వాళ్లు వాదించి, 'కవి గొప్పవాడు. నాటకం రాశాడు. పాట రాకుండా అతడు పద్యాలు రాయడానికి హక్కుంది. పద్యాలు లేకపోతే నాట కమే గాదు. పాట వస్తేగాని రంగంమీదికి రాకూడదు. అన్యుడై ఒప్పవలిసిన నటుడే పాడాలి. పద్యమే పాడాలిగాని, వచనం కూడదు. ఒక వేళ తను గాయకుడైతే, కచేరీచేస్తూ స్వరంవేస్తూ కూచోకూడదు, చచ్చి చెడి రాగంమాత్రం తేల్చి ఊరుకోనూ కూడదు. ఎంత కావాలో అంత, ఉచితమైనంత, (ఎంత ? అంటే, మాకు తెలియకపోడానికి హక్కూ, మరోడు నిర్ణయిస్తే దెబ్బలాడ్డానికి హక్కూ, మేం వదు లుకోం. ఏ నిర్ధారణ చేసినా మాకు పేచీపెట్టే వీలు పోతుందిగనక !) రసపోషణ చేస్తూ. సహజంగాఉండే నడకచొప్పునకుడా తాళనియమం పాటించకుండా, అద్భుతమైన కళ కల్పించాలి,' అనే అసంభవసమ్మే ళన కోరుతూన్నట్టు నటిస్తారు.

నటుడు తన పాత్రని పద్యభాగంలోమాత్రం రాగిస్తూ ఒప్పిం చడానికి చేసే యత్నంలో రెండుమూడు విశేషాలున్నాయి.


ఖలులయి నాఁడు లక్కయిలుఁ గాల్చి, విషాన్నము వెట్టి, జూదపుం
గొలువు ప్రవేశపెట్టి, మముఁ గ్రూరత జీవధనంబులందుఁ బే