అనర్థాలు
87
చేస్తూ, అట్లా కాకుండా యథాగమనంతో పద్యాన్ని ప్రకటించేప్పుడు అది తద్దినపుమంత్రంలా తగులడిపోతుందని యోగ్యతాపత్రం ఇస్తే, దాన్ని తలదాల్చే రసజ్ఞులుఛందస్సు తెలిసినవాళ్లల్లో ఉంటూన్నప్పుడు, పద్యభావానికి పట్టేదుర్గతి ఇంతాఅంతానా! తేరగావస్తే చాలు, ఇతరుల తాలూకు ఎంత సొమ్మైనా పుచ్చుకోగల ధర్మాత్ము లున్నారు. అస లుమజా అంతా అల్లాంటి సొమ్ములోనే ఉంది, పుచ్చుగుంటే అల్లాంటి సొమ్మే పుచ్చుగోవాలిఅని మెచ్చేవాళ్లుంటారు. రేపెప్పుడేనా అల్లాం టిది తమరికికూడా దఖలుపరుచుకోవచ్చు ననిగావును!
అసలు నటుడు, పద్యం పాడడం అనేది ముసుగులో గుద్దు లాట. ఉమ్మడిగా ఉన్నంతకాలం ఏమీ ఒడుదుడుకులుండవ్, అంతా గుంభితంగా గుప్పిడిలో ఉన్నట్టు సాగిపోతుంది. కాని, పంపకాలై వేర్లు పడేసరికి కళ్లు బయటపడి, ఋణాలు తేల్తూంటాయి. ఇది గృహ కృత్యంలో మాట. ప్రస్తుత విషయంలో వాటాదార్లు నలుగురు - (1) పాత్రధారి. ఇతడు రంగం ఎక్కడం అన్యుడై ఒప్పడానికి. మాన సిక అవస్థ తెలిస్తేగాని వ్యక్తి ఒప్పడు. అర్థస్పురణమే అయే పదాల వల్లగాని అవస్థ తెలియదు. ఆ పదాలకర్త అన్యుడు. అవి ఇతడు తనవిలా అంటాడు. (2) పద్యకర్త. పద్యరచయిత మరొకడు. పాత్రధారి పద్యరచయితకుడా అయిఉండినా, అది లోగడే రచించి ఉంటాడుగాని, ఆశువు చెరగడు. (3) రాగకర్త. నటుడే - కాని రంగంమీద ఒప్పవలిసిన వ్యక్తికాడు. పూర్తిగా మాటుమణగవలి సిన పాత్రధారీ కాడు, ఆ పాత్రధారియొక్క గాత్రం మాత్రమే. దానితో అతడు రాగం విసరాలి. రాగంలో అవ్యక్త ఆనందమే ఉంటుందిగాని, అవస్థ తేలదు. పాత్రధారిగాత్రం పాత్రధారివ్యక్తి త్వాన్ని స్థాపించేస్తుంది. (4) ప్రేక్షకులు. నాటక ప్రేక్షకులు శ్రోతలు కుడానూ. వాళ్ళల్లో ఉండరాని వాళ్ళుండరు. అడ్డమైనవాళ్ళూ