Jump to content

పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

86 ఆంధ్ర నాటక పద్యపఠనం స్తత్తదే వేతరోజనః, సయత్ప్రమాణం కురుతే లోక సదనువర్త తే!” పాపంబులు కర్ణములని యేపున జేయంగ నవియు నింపగు, ధర్మవ్యాపా రంబుల కార్యములై పరిణతిపొందెనేవి గుట్టుల సెల్లున్ ' అను రాగంతో వినడం సంగీత నాటకసభ్యులు ఆర్జించుకున్న గొప్ప హక్కుల్లో ఒకటి. సం గీత నాటక సభ్యులకి పద్యంగాని, రాగంగా అక్ష రాలుగాని ఏమోగాని తెలియకపోడానికికుడా హక్కుందిట. వాళ్లకి అటువంటి క్షుద్రరాగా భిరుచి నేర్పి పెట్టడంవల్ల, అది క్రమేపీ ఇతరసభాసభ్యులకి కుడా సంక్ర మించింది. సారస్వతసభలోనైనాసరే, వక్త, ఒక కవి రచించిన పద్యం లోని పదాల్ని యథాక్రమంలో ఉచ్చరించాడా, వాడి పని అంతే! ప్రతీ సారస్వత సభ్యుడూకుడా పెదిమి విరి చేసి, 'ఛీ, ఆయన గొంతిగ విరిచేసి, ఏడిసినట్టుంది. పద్యంలో ఏదో భావం ఉంటేనట్టుకు ? చక్కని గొంతిగ వాడు దానికి తియ్యటి రాగం మేళంగించనప్పుడు, ఆ భావం ఎవడికి కావాలీ ?”అనేస్తారు. అల్లా ఎక్కడ అనిపోతారో అని, కొందరు వక్తలు, తమరికి వచ్చిన కూనురాగం (ఆనకట్టు పూర్వందో, ఇక్ష్వాకుల నాటిదో) తీస్తూ, పద్యంలోని ఉత్కృష్ట భావాన్ని ప్రకటించడానికి యత్నించి, హాస్యాస్పదులై పోతారు. అట్లా కాకుండా ఉండడానికి మరి కొందరు: ' నా గొంతిగ బాగుండదు. నాకుగానం రాదు. అయినాస రే నేను మూలగక మానను, మీరు భరించితీరాలి, గత్యంతరం లేదు. 'అనే లాంటి ఉపోద్ఘాతంలో క్షమాపణదరఖాస్తు పారేసి, దీర్ఘాలు మొదలె డతారు. వేరే కొందరు, రాగాలు విరజిమ్మి విజృంభించగల దిట్టల్ని మొదట్లోనే ఏర్పాటు చేసుగుని, పద్యరచనయావత్తూ వాళ్ల అధీనంలో ఉంచేస్తారు. అల్లాంటివాళ్లు తమ గొంతిగల గిరికీలతో రాగసంగతుల్ని తూటాలు పువ్వులు కక్కినట్టు కక్కిపారేస్తూ పద్యాన్ని ఎగరేసి అది నేలపడకుండా దాన్ని అంతరిక్షంలో నిలబాటు చెయ్యగల సమయంలో మాత్రమే ఆ పద్యభావాన్ని మెచ్చుగుంటున్నాం అని హర్షధ్వనులు