ఆదిభట్ట నారాయణదాసుగారి నెఱుగనివారు తెలుగువారిలో నుండరు. ఆయన హరికధాకధనమున కాద్యబ్రహ్మ, సంస్కృతములో, ఆంధ్రములో, ఆంగ్లములో నాయనయందె వేసినచేయి.ఎన్నోభాషలయం దద్బుతముగా గవిత చెప్పెను. ఎన్నో భాషలయం దనన్య సామాన్యముగా హరికధలు పాడెను. ఆంద్రదేశీయు లేకా, యన్య దేశస్థు లెందరో నారాయణ దాసుగారిని బ్రహ్మరథము పట్టిరి. అట్టి మహాశయుని చిననాటి మనుగడను గూర్చి యాలోచించినచో నేణాశ్చర్యపడుదుము, దాసుగారిది సిరిగల కుటుంబముకాదు. తండ్రి వేంకట చయనులుగారు శ్రౌతస్మార్తములు దిట్టముగా వచ్చిన లబ్దవర్ణులు. ఆయనకు గల యైదుగురు పుత్రసంతానములోను కడపటివాడు నారాయణదాసు. పై పలువురు సోదరులు నేదోరకముగా విద్యావంతులై ప్రయోజుకు లయిరి. కడకు కడపటి సంతతి ప్రయోజకతనుగూర్చి తల్లికి వెఱపు. పసినాటనే తండ్రి నెడబాసిన కొడుకును తల్లిగారు లక్ష్మినరసమాంబ బుజ్జగించి యుగ్గుబాలతో భాగవతతత్త్వమును బోధించినది. ఒకముచ్చట చెప్పుకొందురు. 'గుంప' యను శివక్షేత్రమున శివరాత్రికి గొప్పతీర్థముజరుగును. ఆతీర్థమునకు దల్లితో నారాయణదాసు ప్రయాణమాయెను. బండి యెక్కి తల్లీ కొడుకులు వచ్చు చుండగా బుస్తకములమ్ము నంగడి పసిదాసు కంటబడెను. ఆదుకాణములో పోతనగారి భాగవతము బొమ్మలతో నున్న ప్రాతప్రతి యుండెను. అదిచూచుసరికి నారాయణదాసు తనయొడలు గగుర్వొడున, వెంటనే బండియుఱికి సాహుకారునొద్దకుబోయి యా భాగవత మర్థించెను. ఆసాహుకారిపేరు దాసుగారి చరింత్రములో బంగారునీట వ్రాయదగ్గ "రంగయ్య" యని అతడు "పసివానికి నీకు భాగవత మేలనయ్యా" అని వెటకారముచేయుట తల్లి బండిలోనుండి విని, "కాదు, వాడు చదువుకొందమని యభిలాషతో నడిగె
పుట:AndhraRachaitaluVol1.djvu/95
Appearance