Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బహుజనపల్లి సీతారామాచార్యులు

1827 - 1891

ద్రవిడదేశ వైష్ణవులు. జననము: 1827 సం|| నిధనము: 20-3-1891 సం|| పుట్టుక: నాగపట్టనము. నివాసము: చెన్నపట్టనము. రచించిన గ్రంథములు: సౌందర్యరాజస్వామి శతకము 1849 - వైకృతదీపిక, పదార్థనామకోశము, బాలచంద్రోదయము, 1871 - ఆలఘుకౌముది 1872-నీతిమాల 1872- సతీధర్మసంగ్రహము, ప్రపన్న పారిజాతము 1887-ఆంధ్రశబ్దమంజరి, ఉపాధ్యాయ బోధిని, వినాయక శతకము, త్రిలిజ్గ లక్షణశేషము, శబ్దరత్నాకరము 1855.

సీతారామాచార్యులుగారి పేరు చెప్పినంతనే శబ్దరత్నాకరము, ప్రౌడ వ్యాకరణము జ్ణప్తికి వచ్చుచుండును. శబ్దరత్నాకర ప్రాశస్త్యమును గనిపెట్టి చెన్నపురిలోని దేశభాషాగ్రంధకరణసభ వా రాచార్యులుగారి కైదువేలు సన్మానముగా నిచ్చిరి. నిజమాలోచించినచో నైదులక్ష లిచ్చినను దెలుగువారు వారియప్పు దీర్చుకొనలేరు. "శరీరకష్టమును విత్త నష్టమును నించుకేనియుం బాటింపక" రేలుంబవళ్లు శ్రమించి రచించిన నిఘంటువని నిఘంటుకారులు వ్రాసికొనియేయున్నారు. శబ్దరత్నాకరములోని శబ్దములరూపనిర్ణయము సర్థనిర్ణయము శాస్త్రసమ్మతమైనది. పూర్వ నిఘంటువులకంటె నిది బహువిధముల మేలైనది. అక్షరక్రమముగా రచింపబడిన నిఘంటువులలో నిదిశ్రేష్టము. తెలుగున నీరకమైన నిఘంటువులకు దారితీసినవారు ఎ.డి.కాంబెలు పండితుడు, సి.పి.బ్రౌను పండితుడును. వీరిర్వురు నాంగ్లేయులే. అక్షరక్రమ నిఘంటువులు తెలుగులో వెలయుట కాంగ్లేయులదే యాదిభిక్షము.

తరువాత బరవస్తు చిన్నయసూరిగా రాంధ్రజనసామాన్యమునకందు బాటులో నుండునటు లొక తెనుగుపదముల నిఘంటువును రచింప