పుట:AndhraRachaitaluVol1.djvu/89

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకటించిరి. వీరేశలింగము పంతులుగారును 'వివేకవర్ధని' ప్రక్క హాస్యవర్ధిని వెలువరించిరి. ఇవి యన్యోన్యవివాదములతో జాలకాలము చెలరేగినవి. ప్రసిద్ధపండితు డన్న వా డల్ల వేంకటరత్నము పంతులుగారి గ్రంథములు విమర్శించెను. దీనికి గారణము; ఆయన సంస్కృతాంధ్రములం దసమానపండితుడై మహామహోపాధ్యాయుడను నగ్గలపు బిరుద మా మా డాంధ్రులలో నందుకొనుటయే యనవలయును.


'పలుకు దయ్యమా, ఇది పాయసమమ్మా! బమ్మదయ్యపుటిల్లాలా! ఇది పానకమమ్మా! త్రాగుమమ్మా! అను రీతిని మాటాడు గ్రాంథిక భాషాస్వరూపు డీయన. ఇంటిలో భార్యకడను, బజారులో దుకాణము కడను వీరు గ్రాంథికసంభాషణము గావించెడివారు. అంత పట్టుదల. అఱవము, కన్నడము నెఱుగుదురు. వీరు రచించిన బిల్వేశ్వరీయమున కఱవమున మాతృక యున్నదట. 'గీతమహాసటము' అను పేరితో జయదేవుని గీతగోవిందమువంటి కృతిని వీరు సంస్కృతమున సంతరించిరి. విద్యావినోదము పనప్పాకము అనంతాచార్యులుగారు పంతులుగారిని "ఆంధ్రా జాన్సన్" అని పిలుచుచుండువారు. ఇట్టికవి తెలుగువారికి సదా స్మరణీయుడుగదా!


               ________