పుట:AndhraRachaitaluVol1.djvu/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శ్లో. ఏతాదృగ్భిర్గుణ మణిగణై ర్భూషి తేనై వతేనా
నుజ్ణాంప్రాప్య శ్రితహితకరీం ప్రేమవన్మానపూర్వాం
అల్లంరాజాస్వయమణి రసౌ రంగశాయ్యార్యపుత్ర
స్సుబ్రహ్మణ్యన్సుకవి రకరో చ్చాటుధారార్థసారమ్"

రామయ్యపంతులుగారి నుద్దేశించి సుబ్రహ్మణ్యకవి 'అంతర్లాన' యిటులు చెప్పెను. ప్రశ్నోత్తరములు లోపలనే నిగూడముగా నుండు సమస్యకు 'అంతర్లాన' యనిపేరు.

చెప్పినాడ రెండు చిత్రోత్తరము లిందు
నల జయంతి రామయార్యవరుని
సువచనమున నే దడవిలో జరించు నె
ద్దీశ్వరునికి బ్రియము నెక్కు డనగ.

సుబ్రహ్మణ్యకవి యాధునికుడగుట గ్రంథవిమర్శములనుగూడ వ్రాసెను. శ్రీమన్మాడభూషి వేంకటాచార్యకవి రచించిన 'భరతాభ్యుదయము' న దోషము లున్నవని సప్రమాణముగ జూసి రాజయోగి పత్రికలో వెలువరించెను. కానియిక్కవి రేఫద్వయమైత్రి, అఖండయతి, కొన్ని ప్రాచీనలాక్షణికానభిమత సంధులు విడచి పెట్టలేకపోయెను. అదియటుండె, సుబ్రహ్మణ్యకవి ప్రతిభావ్యుత్పత్తులు సమానముగా గల కవివరుడు. వారిపద్యధారకు జివర నొక యుదాహరణమిచ్చి విడిచెదను.

పగడపుమోవితో జిలుగుబయ్యదతో విడియంపుసొంపుతో
నిగనిగ నుబ్బుసిబ్బెముల నిగ్గులతో దగుగుబ్బదోయితో
సొగసగువేణితో బెళుకు చూపులతో లలిలేతనవ్వుతో
జిగివగగుల్కవచ్చి యొక చేడియచూచె ద్రిలోకమోహనున్
                                               భద్రాపరిణయము------


                   -----------------------------