అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి
1831 - 1892
ఆరామ ద్రావిడ బ్రాహ్మణుడు. హరితసగోత్రుడు. తల్లి: గంగమాంబ. తండ్రి: రంగశాయి. జన్మస్థానము: పిఠాపురము కడనున్న చేబ్రోలు. జననము: 1831- వికృతి సంవత్సరము. నిర్యాణము: 1892. గ్రంథములు: 1. శ్రీకృష్ణభూపతిలలామ శతకము (1853) 2. శేష ధర్మములు (ఆరాశ్వాసముల పద్యకావ్యము). (1867) 3. పాపయమంత్రి శతకము. 4. ఆత్మబోధము (శంకరకృతికి దెలుగుపద్యములు) (1875) 5. మణిధ్వజచరిత్రము (గ్రంథము లభింపలేదు) 6. సింహాద్రి రామాధిప శతకము (1876) 7. భద్రా పరిణయము (1878) 8. శ్రీకృష్ణ లీలా కల్యాణము (1878) 9. చాటుధారా చమత్కారసారము.
ఒకప్పుడు మాడభూషి వేంకటాచార్యుల వారు పీఠికాపుర సంస్థానమునకు శ్రీ గంగాధర రామరాయేంద్రుని దర్శనార్థము వచ్చిరి. అప్పుడు అల్లమరాజు సుబ్రహ్మణ్యకవిగారు నిండుకొలువులోనుండి "ఇక" అను పదముతో నారంభించి కందములో, ప్రభుకీర్తిని వర్ణింపుడని యాచార్యులవారితో ననిరట. వేంకటాచార్యులవారు గొప్ప యాశుకవి. వెంటనే యిట్లు చదివిరి.
క. ఇక నెవ్వరికీర్తులు నీ
ప్రకటగుణుండైన రామరాయ క్ష్మాభృ
త్సుకృతి జనపోషకుని కీ
ర్తికి సరిగారావుసుమ్ము పృథ్వీస్థలిలోన్.
సుబ్రహ్మణ్యకవి "మీ పద్యములో దప్పుకల"దని యాచార్యుల వారి నాక్షేపించెను. 'తప్పులే' దని యాయన గంభీరముగ జెప్పివైచెను. అపుడు సుబ్రహ్మణ్యకవి 'ఇదిగో' నని యీ పద్యమును పఠించెను.
ఇక విను నీయశమునకు ద
లకి శశి కృశుడయ్యును మఱల బెరుగ వేర్వె