పుట:AndhraRachaitaluVol1.djvu/64

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ల్ల కియు గొనెనొకొ తొలిమల కె
లకులను శ్రీరామరాయ లలితశ్రేయా !

"ఇక" సబిందుక శబ్దమగుట దక్కిన చరణములు సబిందుక ప్రాసముతో నడుపవలెనని తక్షణమున వేంకటాచార్యులవారికి దట్టియుండక పోవచ్చును. గంగాధర రామారావుగారు గడుసురాజు. "ప్రబంధకవిత్వమున మీరధికు" లని సుబ్రహ్మణ్యకవిని స్తుతించెను. "ఆశుకవితలో మీ రధికు" లని యాచార్యకవి నభినందించెను.

సుబ్రహ్మణ్యకవి చమత్కృతి కప్పు డట్లనెగాని సబిందుక నిర్బిందుక ప్రాససాంకర్యముచేయనని పట్టుదల పట్టిన కవికాడు. ఆయన భద్రాపరిణయములో (ద్వితీయాశ్వాసము 75 పద్యము చూ.) నెన్నో దీని కుదాహరణము లున్నవి.

ఈ సుకవివరుని చాటుపద్యమణులు తెలుగున వ్యాప్తముగ నున్నవి. ఈయన కాట్రావులపల్లి నూతులపై నొక పద్యము చెప్పెను.

దేవాసురు లబ్ధిదరువ
నావిర్భూతమయి హాలహల మపుడు మహా
దేవునకున్ భీతిలి కా
ట్రావులపలి నూతులందు డాగెంజుండీ.

మాడుగల్లు సంస్థానమునకు బోయినపు డక్కడ నొక్క నియోగికవి వైదికకవులనుబట్టి పడదిట్టుచుండెనట. అప్పుడు సుబ్రహ్మణ్యకవి పట్టలేక యీపద్యము చెప్పెను.

చందనశాఖికన్న విరసంబుగ బూరుగ మేలటన్న ఠీ
విం దగినట్లు వైదికకవిత్వసుధారస ధారలెల్ల జె
ల్వొందగ భూతలంబున నియోగికవిత్వముతోడ సాటిరా
దందురు బెట్టిదంబగునటందురు కొందఱు మూడమానవుల్.

సూరపరాజు మల్లపరాజు అనునాయన గంగాధర రామారావుగారి మిత్రుడు. సుబ్రహ్మణ్యకవి యీయనను జూడబోయెను. "శ్రీరావు