Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేమెల వేంకటరాయ కవి

1820 - 1847

గోదావరీ మండలములోని దుగ్గుదుర్రు గ్రామ నివాసి. వెలమకుల సంభవుడు. ఆరవేల్ల గోత్రేయుడు. తండ్రి: భావయ. జననము: 1820 ప్రాంతము. నిర్యాణము: 1847 ప్రాంతము. రచితగ్రంథము: ఉత్తరా పరిణయము.

ఈకవి వెలమకులీనుడు. ' ఉత్తరాపరిణయ ' మను మూడాశ్వాసముల ప్రౌఢ ప్రబంధము రచించెను. నివాసము కాకినాడ తాలూకాలోని దుగ్గుదుర్రు. అచటికి రెండుమైళ్ల దూరమున ' కుయ్యేరు ' అను పల్లెటూరు కలదు. అది సుప్రసిద్ధ పండితకవియగు పిండిప్రోలు లక్ష్మణకవి పుట్టినయూరు. లక్ష్మణకవికిని వెంకటరాయకవికిని పరస్పర పరిచయమున్నట్లు తత్రత్యులు చెప్పుదురు. ప్రకృతకవి యిరువదియేడేండ్లు మాత్రమే జీవించియున్నట్లు పరంపరాయాత ప్రసిద్ధి.

శ్రీమీఱన్ ధర సద్గుణావళులచే జెన్నొందుచున్నట్టి యా
శ్రీమద్వేంకటనీలశైలపతి వాసిం జూచి పోషింపగా
ధీమద్రాజితదుగ్గుదుర్తిపురి నాత్రేయీసమాలోకనో
ద్దామత్వంబున నుంటి మిచ్చట సదాధర్మార్జనవ్యాప్తిచే.

అని వ్రాసికొనుట బట్టి శ్రీ పీఠికాపుర ప్రభువగు శ్రీ రావు వేంకట నీలాద్రిరాయినింగారి యాదరణమునకు బాత్రు డయ్యెనని వ్యక్తము. ఈకవి జ్యౌతిషమున మంచి ప్రతిజ్ఞావంతుడట. జాతకమునుబట్టి తా నిరువది యేడేండ్ల వయసున మరణింతునని తెలిసికొని పెండ్లి గావించుకొనక గ్రంథరచనా దీక్షితుడై శ్రీరామచంద్ర సేవామగ్నుడై కాలము గడపెను. ఈ స్వల్పవయస్సుననే యుభయభాషాభ్యాసముచేసి " ఉత్తరా పరిణయ " కావ్యమూలమున యశము సంపాదించెను. ఈ ప్రబంధము 1930 లో కవి వంశీయులు శ్రీ రేమెల చినవేంకటరాయినింగారు వెలువ