పుట:AndhraRachaitaluVol1.djvu/552

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నకు దపస్సుతో సాదృశ్యము చెప్పవచ్చును. ఈ యభిప్రాయ మాలంకారికులు సూచించినదియును.

ప్రకృతము; భమిడిపాటి కామేశ్వరరావుగారి ప్రతిరచనయు హాస్యరసప్రచురము. ఆయన రచన చేతిలో నున్న పాఠకుడు, ఏయవస్థలో నున్నవాడైన నవ్వును; చిఱునవ్వును; అంతలో, పెద్దపెట్టున నవ్వును; మరల మందహాసమున కవతరించును; అంతలో, అట్టహాసమున కధిరోహించును. ఇట్లు చేయింపగల నుగుణము, ఆయన వ్రాతలలోను, మాటలలోను, సరితూకముగానే యున్నది. కామేశ్వరరావుగారి కూర్పులలో భావముతోపాటు, భాషయును హాస్యరసోత్పాదకమగుట విశేషము. వ్రహసనకర్తలలో బేరుమోసిన వీరేశలింగముపంతులు, చిలకమర్తి కవియు దీనిని నకృత్తుగా బాటించినారు. "కన్యాశుల్క" కారునిలో స్విష్టకృత్తుగా నీలక్షణమున్నది. 'భమిడిపాటి' వారికి 'గురుజాడ' వారిదారి యొరవడి కావచ్చును. కామేశ్వరరావుగారి రచన వినీవినగనే భాష, మొదల నవ్వించును; భావము పిదప కవ్వించును. వీరిభాషలో అపార రమణీయహాస్యము భావములో విచారిత రమణీయహాస్యము నుండెనని నేననుకొందును.

"...నాగరికత అబ్బి, జెంటిల్ మెన్ అనగా పెద్దమనిషిఅవడానికి సర్వవిధములా పెరుగుతూన్న నన్ను ఈన ఇంతడౌన్‌రైటుగా ఇన్సల్ట్ చేయుట చూచి ఎటులఊరుకొనుట? దేర్‌ఫోర్ తమషా బికేమ్‌కసి. చదువుకోనివాడు ఏదేనాచేస్తే తప్పు. అదే చదువుకున్నవాడు చేస్తే పామరులకి తప్పులా కనిపించినా దానిగర్భంలో గొప్పప్రిన్సిపల్ ఉందని సమర్థించి, తప్పుకాదని స్థాపించి, అదిఒకవేళ నలుగురికీ భర్జించకపోతే కాంట్ హెల్ప్ అనగా సహాయము చేయలేము అని చెప్పిపారేసినెగ్గొచ్చు..." "బాగుబాగు" నుండి ఊరకే మచ్చుకొఱకై యీపంక్తులు పేరుకొంటిని. స్థూలరూపముగా నుండిన యిక్కడిభాషలోను సూక్ష్మరూపముగానుండిన భావములోను మనస్సులను గదలించి నవ్వింపగ తీరు స్పష్టముగా దోచుచున్నది.