Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/533

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

510


ఉప్పొంగి పోయింది గోదావరీ తాను
తెప్పున్న ఎగిసింది గోదావరీ.
కొండల్లు ఉరికింది కోనల్లు నిండింది
ఆకాశ గంగతో హస్తాలు కలిపింది - || ఉప్పొంగి ||
ఆడవిచెట్లన్నీని జడలలో ముడిచింది
ఊళ్లు దండల గుచ్చి మెళ్ళోన తాల్చింది - || ఉప్పొంగి ||
వడులలో గర్వాన నడలలో సుడులలో
పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తు వచ్చింది - || ఉప్పొంగి ||
శంఖాలు పూరించి కిన్నెరలు మీటించి
శంకరాభరణ రాగాలాప కంఠయై - || ఉప్పొంగి ||
నరమానవుని పనులు సిరిమొగ్గి వణకాయి
కరమెత్తి దీవించి కడలికే నడిచింది - || ఉప్పొంగి ||

ఈ మొదలగు పాటలు వీరివి పరివ్యాప్తములై యున్నవి. సన్నని స్త్రీకంఠస్వరముతో, అభినయము చేయుచు గూడ బాపిరాజుగారు పాడుచున్నపుడు, ఈపాట లెంతో ముచ్చటగా వినవేడుక. ఈయన పద్య బంధములు వ్రాయుటకు దఱచుగా నిచ్చగింపనివారు.

ఇక, బాపిరాజుగారి ప్రతిష్ఠకు బతాక నెత్తిన రచనలు నారాయణరావు, హిమబిందు, గోన గన్నారెడ్డి, తుపాను, కోనంగి మున్నయిన నవలలు, "నారాయణరావు" రచనతో వీరిపేరు సుప్రతిష్ఠితమై వెలసినది. అది యాంధ్ర విశ్వవిద్యాలయమువారి సత్కారమునకు భాజన మగుటయేకాక, ఆంధ్ర ప్రజల డెందము రూపించిన కూర్పు. వచన రచన బాపిరాజుగారిది హృదయంగమ మైనది. గ్రాంథికము, వ్యావహారికము తుల్య ప్రపత్తితోనే వ్రాయ గలవారు. వ్రాతలో నెన్నో క్రొత్తమలుపులు, పొలుపులు చూపగలరు. పాత్రలతో సర్వాత్మనా కలియగల శక్తి వీరిలో నున్నది. సంఘమర్యాదలు సుసూక్ష్మ