Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/526

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపుటములు పెంచకపోయినను, బయటబెట్టిన యక్షరములు రసస్రోతస్సులు! ఆయన యిట్లు పాడుకొనుచున్నాడు.

నా హృదయమందు విశ్వ వీణాగళమ్ము

భోరు భోరున నీనాడు మ్రోత వెట్టు

దశదిశా తంత్రు లొక్క నుధాశ్రుతిని బె

నంగి చుక్కల మెట్లపై వంగి వంగి

నిలిచి నిలిచి నృత్యోత్సవమ్ముల జరించు.

             *

వెలుగులో, అమృతాలొ, తావులొ, మరేవొ

కురియు జడులు జడులు గాగ, పొరలిపాఱు

కాలువలు గాగ, పూర్ణకల్లోలములుగ

కలదు నాలోన క్షీరసాగరము నేడు.

                       _____________