పుట:AndhraRachaitaluVol1.djvu/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈకవి చిన్ననాటనే పితృవియోగము నంది మాతామహుడు కాకరపర్తి వేంకటశాస్త్రియొద్ద సంస్కృత మభ్యసించెను. ఇతని మేనమామలలో పాత్రసూరి యనునతడు "సత్యభామా కృష్ణ సంవాదము" అనుసందమై ప్రబంధము రచించెను.

ఈవేంకటకవి మండపాక పార్వతీశ్వరకవి, కాకరపర్తి పాత్రసూరి కవులకు సమకాలికుడగుట--వ శతాబ్ది యారంభములోని వాడని తెలియవలయును. ఈయన "తత్త్వ సంగ్రహరామాయణము" రచించు చుండుట దెలిసి సాలూరు జమీందారును, కాశింకోట జమీందారును కృతినిమ్మని కోరిరట. నరకృతిగావింప నిష్టపడక తనగ్రంథము శ్రీకృష్ణ భగవదంకితము గావించి యీకవి చరితార్థుడయ్యెను. ఇందలి కవిత సంస్కృతపద ప్రచురము. వ్యాకరణవిశేషము లిక్క వీ యెఱుంగుడనుట కనేక నిదర్శనము లున్నవి.


క. ఏహి గృహన్ పతిభిక్షాం

దేహి దయాక్షీరవారిధే సస్త్రాహి

త్రాహి రవిజం భటం జా

నీహి జహీహి క్రుథా మనీషాం శాంత్యా.


ఇది శుద్ధసంస్కృతకందము. ఇట్టి వింకను గలవు. గ్రంథకర్త స్యాలకుడు వజ్ఘల అన్నయభట్టు ఈగ్రంథము కొంతభాగము పూరించెను.


గీ.స్యాలకుడు మాకు సాహితీపాలకుండు

వజ్ఘల లన్నయభట్టు కవసవిశేష

తులితనన్నయభ ట్టురుబలసహాయ

మొనర జేయగ నీగ్రంథమును రచింతు.


అని కవి చెప్పుకొని, బాలకాండము మొదలు సుందరకాండాంతము-యుద్ధకాండములో గుంభకర్ణ యుద్ధాంతముగను-తరువాత రావణ ద్వితీయ యుద్ధభాగము సీతాపరిగ్రహణ పట్టాభిషేక ఘట్టము వ్రాసి