పుట:AndhraRachaitaluVol1.djvu/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్తిచేసెను. నడుమది వజ్ఝల అన్నయ భట్టు ఎనుబదిపద్యములలో బూరించెను. పూరణ శైలి వేఱుగా నున్నది. వార్థకభీతిచే నీకవి యితరునుచే వ్రాయించెనా? యని సందేహించెదము. షష్టిపూర్తి కాకుండగనే యితడు మరణించెననియు, గ్రంథరచనమునకు బదునైదేండ్లు పట్టినదనియ దద్వంశీయులు చెప్పుదురు.


ఈ రామాయణమేగాక వేంకటకవి మూడుశతకములు కూడా రచించెను. "రామా" అనునది యొకటియు, "నారాయణ ! భక్త పోషణా ! శ్రీరమణా !అనున దొకటియు "రామప్రభూ" అనున దొకటియు నా శతకములకు మకుటములు. ఈ రామాయణములో నాయా శతకపద్యములు శ్రీరామస్తప సందర్భమున గలవు. మచ్చున కందలి పద్య మొకటి ప్రకటింతును.


అఘనాశాఖిల దేవతానిచయ సౌఖ్యప్రాపకోద్యత్ర్పభా

వఘనా! దివ్యసువర్ణ చేలమణి భాస్వత్కాంచి కాంచన్మహా

జఘనా! హార కిరీట ముఖ్యవర భూషాభూషిత ప్రోజ్జ్వలా

వఘనా! కీర్తిఘనా! ఘనాఘన సమాభాధామ! రామప్రభూ!

                        ------------------