పుట:AndhraRachaitaluVol1.djvu/508

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చువరకు బ్రభుత్వము వారి విద్యాశాఖలో నుద్యోగము. అంతటి నుండి, యారు వత్సరములు హైదరాబాదు శాసన నిర్మాణ సభలో నాంధ్రానువాదక పదవీనిర్వహణము. పిమ్మట నిరువదినాలు గేండ్లు నిండుగా హైకోర్టు వకీలువృత్తి. ప్రకృతము విశ్రాంతి. హనుమంతరావుగారికి ఆంగ్లము, ఆంధ్రము నందేకాక సంస్కృతము, ఉరుదూ భాషలలోగూడ మంచిపాండితి యున్నది. వీరికి శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులుగారి రచనా విధానము ఆదర్శమత. వ్యావహారిక భాషయం దెక్కువ యాదరనముగాని దాని యుపయోగమును గూర్చి యెక్కువ విశ్వాసముగాని కలవారు కారు.

విశేష మేమనగా హనుమంతరావుగారు హైదరాబాదు రాజ్యములో నేటి ప్రజోద్యములయందు బాలుగొని గొప్ప కీర్తి గడించినారు. రచయితలలో వారికీయదగిన గౌరవము, ఆకీర్తిని బట్టి కాక సాహిత్య-చరిత్ర సంబంధమైన మల్లికా గుచ్ఛ, మహా భారత సమీక్షణాది కృతి రచనమువలన నని గుర్తింపవలయును.