పుట:AndhraRachaitaluVol1.djvu/502

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఎన్ని విధాలనో హృదయమిచ్చి భజించితి విట్టి క్రూరునిన్

నిన్ను దలంచి చిత్త సరణిన్ విలపింతున, జాలి నింతునా ?

ఇన్ని విధమ్ములన్ హృదయ మిచ్చిన ప్రేయసి వీటి బుచ్చితిన్

నన్ను గుఱించి పల్లటిలనా, పెనుసిగ్గున మ్రగ్గిపోదునా ?

ఎన్నగరాని కూర్మి నిలువెల్ల నొకింతగ రాగపూర్ణమౌ

సొన్నపు బానపాత్రయగుచున్ గరయుగ్మమునందు నిల్చు నా

పెన్నిధి, నిష్టదైవమును వీఱిడినై యిటు పాఱవైచికొం

టి, న్నిరుపేదనై యలమటించెద దిక్కఱి రిత్తజోగినై.

వలపుల్ వడ్డికి బాఱ గౌగిట గదింపం బాత్రవై, నిండుచూ

పులకున్ వెన్నెలవై, శ్రవోయుగళి, కింపుల్ నింపు గానమ్మవై

యలరుందావివియయ్యు నూర్పులకు, బై నాత్మైక భోగ్యంబవై

తలపుల్ దాటి, యభిన్నవై, తుది మదాత్మా! నాకు లేవైతివే.

          *

వసివాళ్వాడ, దొకప్పుడు

గను గందదు, మేల్మిచాయ కగ్గదు, తావుల్

కొసరు, మరందము చిలుకును

వినువక యెద దాల్తు నట్టి ప్రేమనుమమ్మున్.

నాకీలోకముతో బనేమి, వినుమన్నా ! పాలమున్నీటిలో

నేకాంత మ్మగుచో బ్రవాళములచే నేపారు ద్వీపమ్ములో

నాకుల్ రాలని పూలువాడని వసంతారామ మధ్యమ్ములో

రాకాచంద్ర సహస్రముల్ వెలుగు హర్మ్యాగ్రంబునం దొక్కటన్.

నాకుం బ్రాణము ప్రాణమైన చెలితో నానానుఖమ్ముల్ లతా

నీకమ్మె పెనగొన్న డోలికలలో ని:ఖేద దివ్యామృత

స్వీకారమ్ము భజింపుచున్ సమయముల్ సీమల్ వెసన్‌దాటి,

కాకారమ్మును నిత్యమై నెగడు నయ్యానంద మర్థించెదన్.

          *