పుట:AndhraRachaitaluVol1.djvu/501

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నడపుల రాజహంస, తెలినవ్వుల వెన్నెలవాక, ప్రేమలూ

రెడు నునుబల్కు దేనెపెర, రెమ్మలువై చు విలాసవల్లి, వ్రే

ల్మిడి హృదయమ్ము నుచ్చిచను మేలిమిచూపు మదాళియైన యా

పడ తుక నందభాస్కరుని బాయగ నోర్వదు ఛాయయుం బలెన్.

తానా, నుందర నందు ; డవ్వెల దియా, తన్వంగ మాధుర్య లీ

లా నందైక నిధాన ; మొండొరుల ప్రేమాలాప కేళీ వినో

దానూనాను భవమ్ములా, మదన విద్యా దైశికమ్ముల్ ; సముల్

కానన్ రారుగదోయి, కామిజనలోకమ్మందు నాదోయికిన్.

        *

పద్యములకు బ్రకరణము స్పష్ట పడుచుండుటచే వ్రాయుటలేదు. మఱి కొన్ని యుదాహరించుటకు మనసు పడుచున్నాను. రసభావాభ్యుదయ మిందెంతదాక సాగుచున్నదో మీరే యెన్ను కొనవలయును.

బ్రతుకు నిక్కమ్మయేని యవ్వారిపట్ల

విరతిలేని స్వప్నమ్మునా జరుగ బోలు

బ్రతుకు నిక్కముగాక స్వప్న మగునేని

సత్యమై తోపబోలు నాజంపుతులకు.

     *

రాగరంజిత మన్మనోరత్న మింత

యింత శకలమ్ము లొనరించి యింతి! నీదు

కంఠహారమ్ము నొనరింతు, గడమ యిడక

వినుతు హృదయ ప్రబంధమ్ము విశద ఫణితి!

వెలది! యీ రాగలతలు పుష్పించు నట్టు

లీ మనోరథములు ఫలియించు నట్లు

దరు లొరసి పాఱు నీ మమతాస్రవంతి

దేలిపోదము పెఱతలంపేల మనకు?

        *