పుట:AndhraRachaitaluVol1.djvu/487

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఇందాక, సుబ్బారావుగారి యాశుకవితా సన్న్యాసమును గూర్చియను కొంటిమి. ఈ పద్యము లాసన్నివేశములోనివి:-

             *

నతమున్ ధేనువ కొండవారి నిజవాసంబందు మృష్టాన్న సం

గతసౌఖ్యం బమరెన్, వధానమును సాంగం బయ్యె పట్టాభిరె

డ్డి తురాసాహుని మ్రోల నాకు కవితోడ్డీన క్రియావేళ నా

యత వాగ్బంధనమున్ తవిల్చితి తుషారాహార్యపుత్రీ! యిదే

హితమం చెంచితె బుచ్చి రెడ్డి నగరీ శృంగాటకంబందునన్.

             *

తెనుగే తీయని దందు పద్యపద రీతిక్రీడ లత్యంత మో

హనముల్ శోభనముల్ తదీయరసరక్తాలావనంబుల్ లభిం

చిన వాగర్థ కలా కలాప జయలక్ష్మిన్ గాలికిం బుత్తునే

జననీ, యేమిటి కింక, అశుకవితా సన్న్యాస మిప్పింపవే!

             *

రసమో, భావమొ, జీవదర్థ సుకుమార వ్య్ంజనా మంజు శ

బ్ద సమాసారచనంబొ, సాధు హృదయస్పంద ప్రతిష్టా కథా

వినరంబో సకలార్థశూన్యమగు నీ వేగాతివేగోక్తి దు

ర్వ్యసనం బేటికి త్రిప్పు మింక జననీ, రమ్యాక్షరక్షోణికిన్,

ఈపరిణామముతో నక్షరరమ్యత సుబ్బారావుగారిని వలచివచ్చినది. పద్యబంధములేకాక , పాటలుకూడ రాయిప్రోలుకవి తియ్యగా బాడుకొనెను.

పదవేచెలి, కాళ్ళగజ్జియల్, రవళింపగ వెదుళ్ళపల్లికిన్

తొలి ప్రొద్దుల చల్ది యన్నమున్, తిని త్రిమ్మరవచ్చు స్వేచ్ఛగా

మధుమాసపు కన్నె యెండలో, ఎలకొబ్బరితోట నీడలన్

పసుపాడిన నిమ్మచెంగటన్, వయసారిన మావిపొత్తునన్