పుట:AndhraRachaitaluVol1.djvu/478

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పట్టములు పడయ వలయుననెడి తీవ్రాశను, ధనాభావము సన్నవడ జేసినది. పసినాట సంస్కృత విద్యాభ్యాసము . మేనమామగారి సహకారముతో "స్కూలుఫైనలు" ఉత్తీర్ణత. అప్పటి శర్మగారి యీడు పదునారేండ్లు. ఆలేతవయస్సులో నుద్యోగము కోసము నవసి నవసి యెచ్చటను స్థిరపడక యుండెను. నాటి జాతీయ మహోద్యమ నాదములు శర్మగారిలో నొక నూతనచైతన్యము రేపినవి. 1911 సం.ప్రాంతములో నుద్యోగ గవేషణము వదలుకొని మదరాసు ప్రయాణము. అచట, ఆంధ్రులచరిత్ర గ్రంథము సంధానించుచున్న మహామహుడు చిలుకూరి వీరభద్రరాయనితో బరిచితి యేర్పడినది. శర్మగారికి రావుగారితో జరిత్రపరిశోధనము గావింప దలంపు కలిగినది. ఆదిలో, "కన్నమరాగ్రంథాలయము" న నచ్చుగాని కృతులకు బ్రతులు వ్రాయుట శర్మగారి యుద్యోగము. చాలీ చాలని యక్కడి జీతముతో జీవితము సాగించుకొనుచు నున్న శర్మగారికి, లక్ష్మణరావుగారి చెలికారము, భావ్యర్థ సమవలంబమైనది. 'ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ' రచనా సహకృతితో శర్మగారికి లక్ష్మణరావుగా "రర్థసింహాసన మిచ్చి యభినందించిరి.


1912 లో, ఆంధ్రుల చరిత్ర రచన ముగిసి వీరభద్రరావుగారు రాజమహేంద్రవరము వచ్చివేసినారు. శర్మగారును మదరాసు మకాము మాని రాజమహేంద్రవరమే వచ్చి యుండి 1914 మొదలు నాలుగేండ్లు చిలకమర్తి లక్ష్మీనరసింహరావుగారి 'దేశమాత^ పత్త్రికకు సంపాదకత నిర్వహించిరి. ఈ సంపాదకత్వము శర్మగారి పరిశోధన రచనా ప్రణాళికకు జక్కని త్రోవలు తీయించినది. మఱియొకటి చెప్పదగిన సంగతి; వీరు "ఆంధ్రాభ్యుదయ గ్రంథమాల" నెలకొలపి ఆంధ్రవీరులు, ప్రాచీన విద్యాపీఠములు, ప్రాచీనాంధ్ర నౌకా జీవనము మున్నుగా గొన్ని గ్రంథములు వెలువరించిరి. ఈతీరున సారస్వతమును సేవించు మల్లంపల్లి